Sanjay on Virat Kohli: ఐపీఎల్ టైటిల్ గెలవడం కోహ్లీ డ్రీమ్.. ఈ సారి సాధ్యమవుతుంది.. సంజయ్ మంజ్రేకర్ జోస్యం
Sanjay on Virat Kohli: ఐపీఎల్ టైటిల్ గెలవడం విరాట్ కోహ్లీ చిరకాల స్వప్నమని, ఈ సారి ఆర్సీబీ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సంజయ్ మంజ్రేకర్ అన్నారు. కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో అభిమానులు కూడా ఈ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Sanjay on Virat Kohli: టీమిండియా విరాట్ కోహ్లీ గత 15 ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఏ జట్టు మారకుండా ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే. తన జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్న కోహ్లీ కోరిక ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే మారింది. ప్రతిసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి చివరకు ఆ ఆశ తీరకుండానే అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలిచేందుకు మంచి అవకాశముందని స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
"అవును.. ఈ సారి విరాట్ కోహ్లీ చిరకాల స్వప్నమైన ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ సాధించే అవకాశముంది. వారికి అద్భుతమైన బౌలింగ్ ఎటాక్ ఉంది. ఫాఫ్ డుప్లెసిస్ పరుగులు చేస్తే బెంగళూరుకు టైటిల్ కొట్టేందుకు ఎక్కువ అవకాశముంది." అని సంజయ్ మంజ్రేకర్ అన్నారు.
ఇంతకుముందు విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులకు, ఆర్సీబీ ఆటగాళ్ల మధ్య స్వచ్ఛమైన సంబంధం నెలకొందని సంజయ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోనే వారు బెస్ట్ ఫ్యాన్స్ అని కొనియాడాడు.
"ఏళ్ల తరబడి ఈ ఫ్రాంఛైజీ, అభిమానుల మధ్య సంబంధం అసాధారణంగా మారింది. ఎందుకంటే రెండు వేర్వేరు దేశాలకు చెందిన వ్యక్తులు ఎంతో ప్రేమను అందుకున్నారు. వారిని తమ సొంతంగా అంగీకరించారు. ఇది ఆటకు మించిన విషయం. ఫీల్డ్‌లో మేము చేసే పనికంటే కూడా మించింది. ఇది స్వచ్ఛమైన కనెక్షన్. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమ అభిమానులు వీరే" కోహ్లీ అని తెలిపాడు.
కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావడంతో ఆర్సీబీ అభిమానులు కూడా టైటిల్‌పై గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్‌లో తమ జట్టు విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. గతేడాది ఆసియా కప్‌లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోహ్లీ సెంచరీ చేయడంతో ఈ స్టార్ బ్యాటర్ భీకర ఫామ్‌లోకి వచ్చాడు.
సంబంధిత కథనం