తెలుగు న్యూస్  /  Sports  /  Jos Buttler Fined For Showing Dissent Against Yashasvi Jaiswal After Run Out

Jos Buttler: పాపం బట్లర్.. యశస్వి కోసం వికెట్ త్యాగం చేశాడు.. ఫైన్ కట్టాడు

Hari Prasad S HT Telugu

12 May 2023, 10:58 IST

    • Jos Buttler: పాపం బట్లర్.. యశస్వి కోసం వికెట్ త్యాగం చేశాడు.. చివరికి ఫైన్ కట్టాడు. ఐపీఎల్ కోడ్ ఆప్ కండక్ట్ ఉల్లంఘించిన కారణంగా బట్లర్ కు 10 శాతం జరిమానా విధించారు.
జోస్ బట్లర్
జోస్ బట్లర్ (IPL Twitter)

జోస్ బట్లర్

Jos Buttler: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. అతని మ్యాచ్ ఫీజులో పది శాతం కోత పెట్టారు. కేకేఆర్ తో మ్యాచ్ లో అతడు యశస్వి జైస్వాల్ కోసం తన వికెట్ త్యాగం చేశాడు. పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ గా వెనుదిరిగాడు. అయితే తాను ఔటైన తర్వాత అతడు యశస్విపై అసహనం వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన కారణంగా జరిమానా విధిస్తున్నట్లు రిఫరీ చెప్పాడు. "రాజస్థాన్ రాయల్స్ కు చెందిన జోస్ బట్లర్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించాం. అతడు కేకేఆర్ తో మ్యాచ్ లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించాడు. ఇందులో ఆర్టికల్ 2.2 ప్రకారం బట్లర్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందులో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్" అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తేల్చి చెప్పింది.

నిజానికి ఇలా ఫైన్ విధించడానికి స్పష్టమైన కారణం చెప్పకపోయినా.. రనౌటైన తర్వాత అతడు వ్యక్తం చేసిన అసహనం కారణంగానే విధించినట్లు తెలుస్తోంది. క్రికెట్ వస్తువులతో అనుచితంగా ప్రవర్తించడం, అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం, అసభ్య పదజాలం ఉపయోగించడం, అతిగా అప్పీల్ చేయడంలాంటివి లెవల్ 1 తప్పిదం కిందకు వస్తాయి.

యశస్వి కోసం బట్లర్ తన వికెట్ పారేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అతడు మూడు బంతులు ఆడి డకౌటయ్యాడు. అయితే యశస్వి మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో రికార్డు క్రియేట్ చేయగా.. చివరికి 47 బంతుల్లో 98 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ గెలిపించాడు.