తెలుగు న్యూస్  /  Sports  /  Indian Men's Badminton Team Enters Thomas And Uber Cup Finals

Thomas & Uber Cup |1979లో సెమీస్‌...2022లో ఫైన‌ల్‌...

HT Telugu Desk HT Telugu

14 May 2022, 7:29 IST

  • థామస్ అండ్ ఉబెర్ క‌ప్‌లో తొలిసారి భారత్ ఫైనల్ లో అడుగుపెట్టింది. సెమీఫైన‌ల్ లో ష‌ట్ల‌ర్లు కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్ లు చెలరేగడంతో పటిష్టమైన డెన్మార్క్ పై 3-2 తేడాతో భారత్ విజయాన్ని అందుకున్నది. ఫైనల్ ఫైట్ కోసం ఇండోనేషియాతో భారత్ పోటీపడబోతున్నది.

థామస్ అండ్ ఉబెర్ క‌ప్‌
థామస్ అండ్ ఉబెర్ క‌ప్‌ (twitter)

థామస్ అండ్ ఉబెర్ క‌ప్‌

థామస్ అండ్ ఉబెర్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిసారి భారత జట్టు ఫైనల్ కు చేరుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది. శుక్ర‌వారం జ‌రిగిన‌ సైమీఫైనల్ లో డెన్మార్క్ పై 3-2 తేడాతో విజయాన్ని అందుకున్నది ఇండియా. ఈ బ్యాడ్మింటన్ టోర్నీలో 1979లో భారత్ సైమీ ఫైనల్ కు చేరుకున్నది. ఇదే ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఆ రికార్డును యువ షట్లర్ల బృందం అద్వితీయమైన ఆటతీరుతో చెరిపివేశారు. డెన్మార్క్ తో జరిగిన సెమీఫైన‌ల్ లో తొలి మ్యాచ్ లో లక్ష్య సేన్ ఓటమి పాలైన సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్ డబుల్స్ లో సాత్విక్ సాయిరాజు- చిరాగ్ శెట్టి జోడీ అద్భుతంగా ఆడి భారత్ ను ఫైనల్ కు చేర్చారు. 2- 2 తో స్కోరు సమమైన పరిస్థితుల్లో ప్రణయ్ 13-21 21-9 21-12 తో ర‌స్‌ముస్‌పై చెలరేగి ఆడి ఇండియాకు గ్రాండ్ విక్టరీని అందించారు.

తొలిసారి భారత్ ఫైనల్ కు చేరుకోవడంతో సంబరాలు అంబరాన్నాంటాయి. పలువురు ప్రముఖులు షట్లర్లకు ప్రశంసలను అందజేస్తున్నారు. ఇప్ప‌టికే సిల్వ‌ర్ ఖాయం చేసుకున్న భార‌త ష‌ట్ల‌ర్లు గోల్డ్ మెడ‌ల్ కోసం ఆదివారం ఇండోనేషియాతో త‌ల‌ప‌డ‌బోతున్నారు.

 

టాపిక్