తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Swiss Open | స్విస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన సింధు, ప్రణయ్

Swiss Open | స్విస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన సింధు, ప్రణయ్

HT Telugu Desk HT Telugu

27 March 2022, 7:01 IST

    • స్విస్ ఓపెన్‌లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఫైనల్‌కు చేరాడు. సింధు థాయ్‌లాండ్ క్రీడాకారుడు సుపానిదాపై విజయం సాధించగా.. ప్రణయ్ ఇండోనేసియా ప్లేయర్ ఆంథోనీ సినిసుకాను ఓడించా తుదిపోరుకు అర్హత సాధించాడు.
స్విస్ ఓపెన్ ఫైనల్స్‌లో సింధు, ప్రణయ్
స్విస్ ఓపెన్ ఫైనల్స్‌లో సింధు, ప్రణయ్ (Feed)

స్విస్ ఓపెన్ ఫైనల్స్‌లో సింధు, ప్రణయ్

రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అదరగొడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న స్విన్ ఓపెన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో వరుస విజయాలో దూసుకెళ్తోంది. తాజాగా శనివారం జరిగిన సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు సుపానిదా కేట్‌థాంగ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇదే సమయంలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా అదరగొట్టాడు. శనివారం ఇండోనేసియ ఆటగాడు ఆంథోనీ సినిసుకాను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

వరల్డ్ నెంబర్ అయిన 7 సింధు తొలి సెట్‌లో ప్రత్యర్థిపై పై చేయి సాధించి. మెదటి నుంచి ఆధిక్యం సాధించిన ఈ తెలుగు తేజం ఒకానోక దశలో 15-7తో మెరుగైన స్థితిలో ఉంది. అయితే థాయ్‌లాండ్ క్రీడాకారిణి పుంజుకున్నప్పటికీ వరుస పాయింట్లతో తొలి సెట్‌లో గెలిచింది. రెండో సెట్‌లో తీవ్రంగా పోరాడిన సింధు.. తృటిలో ఆ గేమ్‌ను చేజార్చుకుంది. ఇక మూడో సెట్‌లోనూ విజయం అంత సులభంగా వరించలేదు. ఇరువురు ఆటగాళ్లకు చెమటోడ్చాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సెట్‌లోనూ సింధు విజయం సాధించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సింధు 21-19, 19-21, 21-18 తేడాతో గెలిచింది. దాదాపు 79 నిమిషాల పాటు సాగింది.

పీవీ సింధు తన తర్వాతి మ్యాచ్ నాలుగో బుసానన్‌తో తుదిపోరులో తలపడనుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో సింధు టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. ఎందుకంటే వీరిద్దరూ ఇప్పటి వరకు 16 సార్లు తలపడితే.. 15 సార్లు సింధూనే విజయం సాధించింది.

మరోపక్క పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్ ఫైనల్‌కు చేరాడు. ఇండోనేసియా ఆటగాడు ప్రపంచ నెంబర్ 5 అయిన ఆంతోనీ సినిసుకా విజయం సాధించాడు. 21-19, 19-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. ఫైనల్‌లో తన సహచర ఆటగాడు కిదాంబీ శ్రీకాంత్ లేదా ఇండోనేసియా ప్లేయర్ జోనథన్ క్రిస్టీతో తలపడనున్నాడు. అంటే వీరిద్దరిలో ఎవరు గెలిస్తే వారితో తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

తదుపరి వ్యాసం