all england badminton | ఫైనల్ లో ఓటమి పాలైన లక్ష్యసేన్...
20 March 2022, 23:59 IST
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టైటిల్ నెగ్గాలనే భారత షట్లర్ లక్ష్యసేన్ కల తీరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్ లో వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్, ఒలింపిక్ విన్నర్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలయ్యాడు.
లక్ష్యసేన్
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత షట్లర్ లక్ష్యసేస్ ఓటమి పాలయ్యాడు. వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్, ఓలింపిక్ విన్నర్ విక్టర్ అక్సెల్సెన్ దూకుడు ముందు తలవంచిన లక్ష్యసేన్ విజయానికి ఒక అడుగు దూరంలో నిలిచిపోయాడు. ఆట మొదలైన కొద్ది నిమిషాల వరకు లక్ష్యసేన్ ఆధిక్యంలో కనిపించాడు. ఆ తర్వాత విక్టర్ స్మాష్ లతో చెలరేగడంలో లక్ష్యసేన్ కు ఓటమి తప్పలేదు. 21-10 21-15 తేడాలో వరుస గేముల్లో లక్ష్యసేన్ పై విక్టర్ విజయాన్ని అందుకున్నాడు. గత వారం జర్మన్ ఓపెన్ లో విక్టర్ పై లక్ష్య సేన్ విజయాన్ని అందుకోవడంతో మరోసారి ఆ ఫీట్ ను పునరావృతం చేస్తాడని అందరూ భావించారు. కానీ అనవసర తప్పిదాలు లక్ష్య సేన్ ఓటమికి కారణమయ్యాయి.
సెమీ ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ లీ జియాను ఓడించి లక్ష్యసేన్ ఫైనల్ చేరుకున్నాడు. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా లక్ష్యసేన్ నిలిచాడు. గతంలో 1980లో ప్రకాష్ పదుకొణే, 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ టైటిళ్లను సాధించారు. 1947 లోప్రకాష్ నాథ్, 2015లో సైనా నెహ్వాల్ ఫైనల్ చేరారు. ఓవరాల్ గా ఫైనల్ చేరిన ఐదో ఐదో ఇండియన్ షట్లర్ గా లక్ష్యసేన్ నిలిచాడు.