తెలుగు న్యూస్  /  Sports  /  Gambhir On Kl Rahul Says Some Former Cricketers Need Some Masala

Gambhir on KL Rahul: మాజీ ప్లేయర్స్‌కు మసాలా కావాలి.. రాహుల్‌ను విమర్శిస్తున్న వారిపై గంభీర్ ఫైర్

Hari Prasad S HT Telugu

20 March 2023, 14:00 IST

    • Gambhir on KL Rahul: మాజీ ప్లేయర్స్‌కు మసాలా కావాలి అంటూ కేఎల్ రాహుల్‌ను విమర్శిస్తున్న వారిపై గంభీర్ ఫైర్ అయ్యాడు. అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా స్పష్టం చేశాడు.
కేఎల్ రాహుల్, వెంకటేశ్ ప్రసాద్, గంభీర్
కేఎల్ రాహుల్, వెంకటేశ్ ప్రసాద్, గంభీర్ (Getty Images-AP-ANI)

కేఎల్ రాహుల్, వెంకటేశ్ ప్రసాద్, గంభీర్

Gambhir on KL Rahul: కేఎల్ రాహుల్ ఫామ్, అతని ఆటతీరు కొంతకాలంగా మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలుసు కదా. ముఖ్యంగా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అయితే రాహుల్ ను తీవ్రంగా విమర్శిస్తున్నాడు. పెద్దల అండతో అతడు జట్టులో కొనసాగుతున్నాడని అతడు అన్నాడు. అయితే అతని ఆరోపణలను గతంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తిప్పి కొట్టగా.. తాజాగా గౌతమ్ గంభీర్ కూడా అదే పని చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రానున్న ఐపీఎల్లో రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టను లీడ్ చేయనుండగా.. ఆ టీమ్ గ్లోబల్ మెంటార్ అయిన గంభీర్ ఇప్పుడతన్ని వెనకేసుకొచ్చాడు. రానున్న ఐపీఎల్లో రాహుల్ ఒత్తిడిలో ఉంటాడా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ ఉండదని, గతేడాది లక్నోను అతడు ప్లేఆఫ్స్ కు తీసుకొచ్చిన విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించాడు.

"ఒత్తిడి ఏంటి? గతేడాది మేము మూడోస్థానంలో ముగించాం. ట్రోఫీని గెలిచేది ఏదో ఒక్క టీమే. గుజరాత్ గెలిచింది. వాళ్లు గత సీజన్ లో బాగా ఆడారు. లక్నో టీమ్ ప్రదర్శన చూస్తే నెట్ రన్ రేట్ ఆధారంగా మూడోస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో నిలిచి ఉంటే ఫైనల్ కు వెళ్లేందుకు రెండు అవకాశాలు దక్కేవి" అని స్పోర్ట్స్ తక్ తో మాట్లాడుతూ గంభీర్ అన్నాడు.

"కేఎల్ రాహుల్ విషయానికి వస్తే అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్, ఐపీఎల్ పూర్తిగా వేరు. ఐపీఎల్లో 1000 రన్స్ చేసినా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లో రన్స్ చేయకపోతే విమర్శలు తప్పవు. అందుకే దానిని అంతర్జాతీయ క్రికెట్ అంటారు. ఇండియాకు ఆడే అవకాశం కేవలం 15 మందికే దక్కుతుంది. ఐపీఎల్లో 150 మందికిపైగా సెలక్ట్ అవుతారు. అందుకే ఈ రెండింటినీ పోల్చొద్దు" అని గంభీర్ స్పష్టం చేశాడు.

గత సీజన్ లో లక్నో తరఫున రాహుల్ 616 రన్స్ చేశాడు. ఈ పర్ఫార్మెన్స్ పై గంభీర్ స్పందిస్తూ పరోక్షంగా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ పై విమర్శలు గుప్పించాడు. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ విఫలమైన తర్వాత ప్రసాద్ అతన్ని లక్ష్యంగా చేసుకుంటూ తీవ్ర విమర్శలు చేశాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో మాత్రం అతడు 75 రన్స్ చేసి టీమ్ ను గెలిపించాడు.

"ఐపీఎల్లో రాహుల్ బాగా రాణించాడు. 4, 5 సెంచరీలు చేశాడు. అలాంటి ప్లేయర్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. గత సీజన్ లో కూడా ముంబై ఇండియన్స్ పై అతడు సెంచరీ చేశాడు. విమర్శించడానికి చాలా మంది ఉన్నారు. కొన్నిసార్లు కొందరు మాజీలు యాక్టివ్ గా ఉండటానికి మసాలా కావాలి. అందుకే వాళ్లు విమర్శలు చేస్తారు. నా వరకూ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ పై ఎలాంటి ఒత్తిడి లేదు. ఒక్క ప్లేయర్ తో టోర్నీ గెలవలేం. డ్రెస్సింగ్ రూమ్ లో ఉండే 25 మంది ప్లేయర్స్ అందుకు సాయం చేయాలి" అని గంభీర్ స్పష్టం చేశాడు.