తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gambhir Legends League Cricket: లెజెండ్స్ లీగ్‌లో అద‌ర‌గొడుతోన్న గంభీర్ - వ‌రుస‌గా మూడో హాఫ్ సెంచ‌రీ

Gambhir Legends League Cricket: లెజెండ్స్ లీగ్‌లో అద‌ర‌గొడుతోన్న గంభీర్ - వ‌రుస‌గా మూడో హాఫ్ సెంచ‌రీ

15 March 2023, 10:55 IST

  • Gambhir Legends League Cricket: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో టీమ్ ఇండియా మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్ వ‌రుస‌గా మూడో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 

గౌత‌మ్ గంభీర్
గౌత‌మ్ గంభీర్

గౌత‌మ్ గంభీర్

Gambhir Legends League Cricket: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో టీమ్ ఇండియా మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్ బ్యాటింగ్ మెరుపుల‌తో అద‌ర‌గొడుతోన్నాడు. ఈ లీగ్‌లో వ‌రుస‌గా మూడో హాఫ్ సెంచ‌రీ సాధించి ఆట‌కు దూర‌మైన త‌న‌లో బ్యాటింగ్ ప‌వ‌ర్ తగ్గ‌లేద‌ని చాటిచెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

లెజెండ్స్ లీగ్‌లో ఇండియా మ‌హ‌రాజాస్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు గంభీర్. మంగ‌ళ‌వారం ఇండియా మ‌హ‌రాజాస్, ఆసియా ల‌య‌న్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 36 బాల్స్‌లోనే 12 ఫోర్ల‌తో గంభీర్ 61 ప‌రుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో త‌న జ‌ట్టును గెలిపించాడు. అత‌డికి తోడు రాబిన్ ఉత‌ప్ప (39 బాల్స్‌లో 5 సిక్స‌ర్లు, 11 ఫోర్ల‌తో 88 ప‌రుగులు) ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ప‌ది వికెట్ల తేడాతో ఆసియా ల‌య‌న్స్‌ను ఇండియా మ‌హ‌రాజాస్ చిత్తుచేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా ల‌య‌న్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 157 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు ఉప‌ల్ త‌రంగ (69 ర‌న్స్‌), దిల్షాన్ (32 ర‌న్స్‌)తో పాటు చివ‌ర‌లో అబ్ధుల్ ర‌జాక్ 27 ర‌న్స్‌తో రాణించారు. ఇండియా మ‌హ‌రాజాస్ బౌల‌ర్ల‌లో రైనా రెండు వికెట్లు తీసుకున్నాడు. ఉత‌ప్ప‌, గంభీర్ మెరుపుల‌తో 158 ప‌రుగుల టార్గెట్‌ను 12.3 ఓవ‌ర్ల‌లోనే ఇండియా మ‌హరాజాస్ ఛేదించింది.

టాపిక్