తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cristiano Ronaldo At Real Madrid: రియల్‌ మాడ్రిడ్‌లో రొనాల్డో.. ట్రైనింగ్‌ మొదలుపెట్టిన స్టార్‌ ఫుట్‌బాలర్‌

Cristiano Ronaldo at Real Madrid: రియల్‌ మాడ్రిడ్‌లో రొనాల్డో.. ట్రైనింగ్‌ మొదలుపెట్టిన స్టార్‌ ఫుట్‌బాలర్‌

Hari Prasad S HT Telugu

15 December 2022, 13:29 IST

    • Cristiano Ronaldo at Real Madrid: రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌లో క్రిస్టియానో రొనాల్డో ట్రైనింగ్‌ మొదలు పెట్టడం ఆసక్తి రేపుతోంది. మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి అర్ధంతరంగా బయటకు వచ్చేసిన తర్వాత ఈ స్టార్‌ ఫుట్‌బాలర్‌ కొత్త క్లబ్‌ వేటలో ఉన్నాడు.
క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (AP)

క్రిస్టియానో రొనాల్డో

Cristiano Ronaldo at Real Madrid: ఈ ఏడాది ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ క్రిస్టియానో రొనాల్డోకు ఏమాత్రం కలిసి రాలేదు. టోర్నీ మొదట్లోనే తన క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌పై అతడు సంచలన ఆరోపణలు చేయడం, ఆ తర్వాత అతని కాంట్రాక్ట్‌ను క్లబ్‌ ముందుగానే రద్దు చేయడం తెలిసిందే. అప్పటి నుంచీ ఫ్రీ ఏజెంట్‌గానే ఉన్న రొనాల్డో.. తన నేషనల్‌ టీమ్‌ పోర్చుగల్‌ను కూడా వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్‌ను దాటించలేకపోయాడు.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

క్వార్టర్‌ఫైనల్లో మొరాకో చేతిలో 0-1తో ఓడిపోయిన తర్వాత పోర్చుగల్‌ ఇంటికెళ్లిపోయింది. ఇక్కడితో ఇక రొనాల్డో వరల్డ్‌కప్‌ ఆశలు నెరవేరనట్లే చెప్పాలి. అయితే అతడు మాత్రం వెంటనే మళ్లీ ట్రైనింగ్‌ మొదలుపెట్టాడు. అతని ఇప్పుడు ఓ క్లబ్‌ అంటూ ఏదీ లేకపోవడంతో రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌లో ఈ ట్రైనింగ్ ప్రారంభించడం విశేషం.

పోర్చుగల్‌ వరల్డ్‌ కప్‌ నుంచి వెళ్లిపోయిన నాలుగు రోజుల్లోనే రొనాల్డో ఇలా రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌లో ట్రైనింగ్‌కు వెళ్లడం ఆసక్తి రేపుతోంది. 2009 నుంచి 2018 వరకూ రియల్‌ మాడ్రిడ్‌ తరఫునే రొనాల్డో ఆడిన విషయం తెలిసిందే. ఇది తన ఇల్లులాంటిదని గతంలో చెప్పిన అతడు.. ఇప్పుడు మరోసారి అక్కడికే వెళ్లి ట్రైనింగ్‌ మొదలుపెట్టాడు.

రియల్‌ మాడ్రిడ్‌తో రొనాల్డోకు మంచి అనుబంధం ఉంది. ప్లేయర్‌గానూ అతడు ఎన్నో అవార్డులు, రివార్డులు ఈ క్లబ్‌ తరఫున ఆడినప్పుడే అందుకున్నాడు. డొమెస్టిక్‌, కాంటినెంటల్‌, గ్లోబల్‌ ట్రోఫీలను అందుకోవడంతోపాటు ప్రతిష్టాత్మక బాలన్‌ డీఓర్‌, ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులను పలుమార్లు అందుకున్నాడు.

2018లో రియల్‌ మాడ్రిడ్‌ను వదిలి జువెంటస్‌ క్లబ్‌కు వెళ్లాడు రొనాల్డో. అక్కడి నుంచి తిరిగి తన పాత క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌కు తిరిగి వచ్చినా.. ఈసారి తన పూర్తి రెండేళ్ల కాలం కూడా అక్కడ ఉండలేకపోయాడు. ప్రస్తుతం ఓ సౌదీ క్లబ్‌తో అతడు డీల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.