Cristiano Ronaldo Deal with Arabian Club: అరేబియన్ క్లబ్‌తో భారీ డీల్ - రొనాల్డో సమాధానం ఇదే
Cristiano Ronaldo Deal with Arabian Club పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరేబియన్ ఫుట్‌బాట్ క్లబ్ అల్ నజర్‌తో భారీ డీల్‌ను కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెక్స్ట్ సీజన్ ఫుట్‌బాల్ లీగ్‌లో అతడు అల్ నజర్ తరఫున బరిలో దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై రొనాల్డో స్పందించాడు.
Cristiano Ronaldo Deal with Arabian Club: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరేబియన్ క్లబ్ అల్ నజర్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. గత ఏడాది మంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు రొనాల్డో. 2009 ఎడిషన్‌లో తొలిసారి మంచెస్టర్ యునైటెడ్ తరఫున ఆడిన రొనాల్డో లాంగ్ గ్యాప్ తర్వాత గత ఏడాది తిరిగి మంచెస్టర్ క్లబ్‌లో చేరాడు. 2021 సీజన్‌లో 24 గోల్స్ చేసిన రొనాల్డో థర్డ్ హయ్యెస్ట్ గోల్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ సీజన్‌ను యునైటెడ్ క్లబ్ ఆరో స్థానంతో ముగించింది. కాగా మంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ఇప్పటికే గుడ్‌బై చెప్పిన రొనాల్డో నెక్స్ట్ సీజన్‌లో అరేబియన్ క్లబ్ అల్ నజర్ తరఫున బరిలో దిగనున్నట్లు ప్రచారం జరిగింది. పోర్చుగల్ స్టార్‌తో అల్ నజర్ క్లబ్ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రతి సీజన్‌కు 200 మిలియన్ యూరోస్ ఇచ్చేలా డీల్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై ఇన్నాళ్లు సెలెంట్‌గా ఉన్న రొనాల్డో ఇటీవల స్విట్జర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా స్పందించాడు. అల్ నజర్‌తో ఒప్పందం అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచించడం లేదని, ప్రస్తుతం తన దృష్టంతా వరల్డ్‌కప్‌పైనే ఉందని రొనాల్డో తెలిపాడు.
కాగా స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెకండాఫ్ మొత్తం రొనాల్డో బెంచ్‌కు పరిమితమయ్యాడు. అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా టీమ్‌లోకి వచ్చిన రామోస్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. కెప్టెన్ అయిన రొనాల్డోను బెంచ్‌కు పరిమితంపై చేయడంపై విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. కోచ్‌తో ఉన్న విభేదాల కారణంగానే రొనాల్డో బెంచ్‌కు పరిమితం అవ్వాల్సివచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.