తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Akash Chopra On Ind Vs Pak: షహీన్‌ అఫ్రిది కాదు.. ఆ పాకిస్థాన్‌ బౌలర్‌తో జాగ్రత్త!

Akash Chopra on Ind vs Pak: షహీన్‌ అఫ్రిది కాదు.. ఆ పాకిస్థాన్‌ బౌలర్‌తో జాగ్రత్త!

Hari Prasad S HT Telugu

19 October 2022, 17:31 IST

  • Akash Chopra on Ind vs Pak: షహీన్‌ అఫ్రిది కాదు.. ఆ పాకిస్థాన్‌ బౌలర్‌తో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్‌ 23) ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

షహీన్ అఫ్రిది, ఆకాశ్ చోప్రా, హరీస్ రవూఫ్
షహీన్ అఫ్రిది, ఆకాశ్ చోప్రా, హరీస్ రవూఫ్ (file photo)

షహీన్ అఫ్రిది, ఆకాశ్ చోప్రా, హరీస్ రవూఫ్

Akash Chopra on Ind vs Pak: ఇండియా, పాకిస్థాన్‌ ఎప్పుడు తలపడినా బ్యాటింగ్‌ vs బౌలింగ్‌ అన్నట్లుగానే పరిస్థితి ఉంటుంది. ఇండియా టాప్‌ బ్యాటర్లకు, పాకిస్థాన్‌ టాప్‌ పేస్‌ బౌలర్లకు పేరుగాంచాయి. ఇప్పుడు ఈ రెండు టీమ్స్‌ మరోసారి తలపడబోతున్న వేళ పాక్‌ పేస్‌ బౌలర్లకు, ఇండియన్‌ బ్యాటర్లకు మధ్య జరగబోయే సమరంగా క్రికెట్‌ పండితులు వర్ణిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ముఖ్యంగా పాకిస్థాన్‌ టీమ్‌లో షహీన్‌ అఫ్రిది, హరీస్‌ రవూఫ్, నసీమ్‌ షాలాంటి బౌలర్లు ఉన్నారు. ఈ ముగ్గురిలోనూ లెఫ్టామ్‌ పేస్‌ బౌలర్‌ షహీన్‌ అఫ్రిది చాలా ప్రమాదకారి అని, అతనితో జాగ్రత్తగా ఉండాలనీ టీమిండియా బ్యాటర్లను చాలా మంది హెచ్చరిస్తున్నారు. గతేడాది వరల్డ్‌కప్‌లోనూ షహీన్‌ అఫ్రిది మొదట్లోనే రోహిత్‌, రాహుల్‌ వికెట్లు తీసి ఇండియన్‌ టీమ్‌ను డిఫెన్స్‌లో పడేశాడు.

దీంతో ఈసారీ అతనితో జాగ్రత్త అన్న హెచ్చరికలు వస్తున్నాయి. అయితే టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం షహీన్ అఫ్రిది కాదు.. హరీస్‌ రవూఫ్‌తో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. "ఆదివారం జాగ్రత్తగా ఉండాల్సిన బౌలర్‌ షహీన్‌ కాదు. అతడు హరీస్‌ రవూఫ్‌. అఫ్రిది తన బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ దిశగా వెళ్తున్నాడు. కానీ ఇంకా పూర్తిగా అందుకోలేదు. 23వ తేదీలోపు అది సాధ్యం కూడా కాదు. రవూఫ్‌ కఠినమైన ఓవర్లు వేస్తాడు. అతడే మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు" అని చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఇక ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో షహీన్‌ వేసిన ఇన్‌స్వింగింగ్‌ యార్కర్‌పై కూడా ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. "ఫుల్‌.. స్వింగింగ్‌.. ఫాస్ట్‌. షహీన్‌ అఫ్రిది తన అత్యుత్తమ ప్రదర్శనకు దగ్గరవుతున్నాడు. గుర్బాజ్‌ బొటనవేలికి ఆ విషయం తెలుసు" అని చోప్రా అన్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు విసిరిన బాల్‌ ఆఫ్ఘన్‌ బ్యాటర్‌ గుర్బాజ్‌ బొటనవేలికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వామప్‌ మ్యాచ్‌లో షహీన్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో వికెట్‌ తీయకపోయినా ఈ మ్యాచ్‌లో అతడు మెరుగయ్యాడు. ఇది ఇండియన్‌ టీమ్‌కు ఒక రకంగా హెచ్చరికే. అందులోనూ గుర్బాజ్‌కు వేసిన ఇన్‌స్వింగ్ యార్కర్‌ చాలా డేంజరస్‌గా కనిపించింది.