తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఉజ్జయిని మహాకాళేశ్వర ఉత్సవం వైభవం ఏమిటి?

ఉజ్జయిని మహాకాళేశ్వర ఉత్సవం వైభవం ఏమిటి?

HT Telugu Desk HT Telugu

29 May 2024, 19:08 IST

google News
    • ఉజ్జయిని మహా కాళేశ్వర ఉత్సవ వైభవం, అక్కడ జరిగే భస్మ హారతి గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. 
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం

కాశీ నగరంతో సమానమైన పురాతన పవిత్ర క్షేత్రాలలో ఉజ్జయిని ఒకటి. క్రీ.పూ. 6వ శతాబ్దానికి పూర్వం నుండే ఉజ్జయిని క్షేత్రం చరిత్ర నమోదు అయివుంది. పలు పురాణ గ్రంథాలలో మహాకాళేశ్వర క్షేత ప్రస్తావన ఉంది.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

పార్లమెంట్​ ఉన్నది కొట్టుకోవడానికే! కిందపడేసి కొట్టి, చంప చెళ్లుమనిపించి..

Dec 21, 2024, 01:04 PM

మహాకవి కాళిదాసు ఈ క్షేత్రం వాడే. భోజరాజుతో సహా పలు రాజవంశాలు ఉజ్జయిని కేంద్రంగా పరిపాలించాయి. ఇక్కడి అమ్మవారు అవంతిక .ఆమె పేరునా అవంతికా నగరంగా కూడా గతంలో పిలవబడింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కాళిదాసు తన మేఘదూతంలో మహాకాళ మందిరాన్ని వర్ణించాడు. అవంతికకు అశోకుడు, విక్రమాదిత్యుడు, చంద్రగుప్తుడు వంటి పాలకులు ప్రాభవం కల్పించారు. ముస్లింలు విధ్వంసం చేసిన మందిరాలలో మహాకాళ మందిరం ఉంది. అయితే తిరిగి హైందవ రాజులు దీనిని పునర్మించారు. సింధియాలు ఈ దేవాలయాన్ని పోషించారు. అవంతిక పురాతన విద్యాపీఠంకూడా. శ్రీకృష్ణ కుచేలుర గురువైన సాందీపుడు ఈ ప్రాంతంలోనే తన ఆశ్రమం కలిగి ఉండేవాడు. ఇప్పటికీ సాందీప ఆశ్రమ స్థలాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఆ ప్రదేశంలో సుందర తటాకముంది.

బ్రహ్మ ప్రతిష్టించినది గర్భగుడిలోని ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం. స్వయంభు అని బ్రహ్మ ప్రతిష్టించినదని చెపుతారు. మహాశివుడు దక్షిణాముఖుడై ఉండటం ఈ క్షేత్ర విశేషం. ఆ కారణంగా శివుడిని దక్షిణామూర్తిగా కొలుస్తారు. ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్తులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద భూగర్భంలో ఉంది మహాకాళ లింగం. మధ్యలో ఓంకార లింగం,ఆ పైన నాగేంద్రస్వరూప లింగం ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తైనది. మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కింద శంఖు యంత్రం అనే ఆశ్చర్యకర యంత్రముందని నమ్ము తారు. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు.

మహాకాళేశ్వరుడి దర్శనంతో ఎవరైనా విజయం సాధించగలుగుతారు. మహాకాళేశ్వరం శక్తిపీఠం కూడా. ఇది తంత్ర సాధకులకు ఆరాధనా స్ధలం. శక్తి పీఠాలలో దాక్షాయణి మాత భైరవునికి తోడుగా దర్శనమివ్వటం తెలిసిందే. అవంతిక రాజ్యాన్ని చంద్ర సేనుడు అనే శివుని భక్తుడు పాలించేవాడు.

సంపన్న దేశమైన అవంతికను దోచుకునేందుకు శత్రురాజు దండెత్తి రాగా, ఆయన శివుని ప్రార్థించగా బ్రహ్మదేవుని ఉపదేశం పొందిన శక్తివంతమైన అదృశ్య రూపంలో ప్రత్యక్షమై శత్రువులను తరిమికొట్టాడు. ఆ మహారాజు ప్రార్ధనలకు పరవశించిన మహాశివుడు అక్కడి లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువై ఉన్నాడు. మహాకాలుడు కాలపురుషుడు. మరణాన్ని నిర్ణయించేవాడు. ఓంకారేశ్వర శివుడిపై అంతస్తులో ప్రతిష్ట చేశారు.

గర్భాలయానికి పశ్చిమంగా వినాయకుడు, ఉత్తరంగా పార్వతి, తూర్పున కార్తికేయుడిని ప్రతిష్టించారు. దక్షిణ ముఖంగా ఉన్న మూర్తికి ఎదురుగా ఆయన వాహనమైన నంది దర్శనమిస్తుంది. మూడవ అంతస్తులో ఉన్న నాగచంద్రేశ్వర రూపం నాగపంచమినాడు మాత్రమే దర్శనమిస్తుందని చిలకమర్తి తెలిపారు.

భస్మ హారతి

మహాకాళేశ్వరంలో మాత్రమే జరుగుతుంది భస్మ హారతి. మరే జ్యోతిర్లింగ క్షేత్రంలో లేని ప్రత్యేకత శివ లింగంమీద శివుని ముఖరూపం ఉండటం. త్రిమూర్తులలో శివుడు క్షయకారుడు. అంతిమంగా మనసుల ప్రదేశమైన స్మశాన నివాసి శివుడు. ఆయన అలంకరణ నీభూతి. అదే భస్మం. సంవత్సరంలో ఒకటి, రెండు రోజులు మినహా మిగిలిన అన్ని రోజుల్లో వేకువజామున భస్మహారతి ఇస్తారు. ఉజ్జయినిలో ఆవు పిడకలను కాల్చి తయారుచేసిన భస్మాన్ని తీసుకువచ్చి వేద మంత్రోచ్చారణల మధ్య సుమారు రెండు గంటలసేపు స్వామిని భస్మంతో పూజించి అలంకరిస్తారు. ఈ రెండు గంటలు సామూహిక హారతి ఆలపించటంతో చాలా భక్తిపూర్వకంగా మారుతుందని చిలకమర్తి తెలిపారు.

మహాకాలేశ్వర కారిడార్లపై శివుని మహిమలు తెలియచేసే శిల్పాలను ఏర్పాటు చేశారు. దేవాలయానికి ఎదురుగా ఉన్న రుద్రసాగర సరస్సు ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేది. పట్టణంలోని మురికినీరు వదలటంతో మట్టికుప్పవేసి ఎండిపోగా, దానిని శుభ్రపరిచి, విస్తరించి, దాన్ని తిరిగి 17 హెక్టార్ల విస్తీర్ణానికి తీసుకు వెళుతున్నారు. దూరప్రదేశాల నుండి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించటంతో పాటు స్థానిక భక్తుల దైవదర్శనానికి అడ్డంకి లేకుండా ప్రతిరోజూ ఉదయం ఆరునుండి ఎనిమిది గంటల వరకు వారికే ప్రత్యేక సమయం కేటాయించారు. ఉజ్జయినిలో ప్రతిరోజూ మహాకాళేశ్వరుని దర్శించుకునే భక్తులున్నారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి తెలిపారు.

ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం