Vastu tips: ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలే కాదు మంగళ దోషం కూడా తొలగిపోతుంది
14 February 2024, 14:00 IST
- Vastu tips: హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం అశోక వృక్షం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు, వివాహాన్ని ఆలస్యం చేసే మంగళ దోషం కూడా తొలగిపోతుంది.
అశోక చెట్టు
Vastu tips: వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు సమస్యల నుంచి బయట పడాలంటే ఇంట్లో మనీ ప్లాంట్, లక్కీ వెదురు, కుబేర మొక్క వంటివి ఉంటే మంచిదని చాలా మంది అనుకుంటారు. కానీ అవి మాత్రమే కాదు ఈ చెట్టు ఉన్నా కూడా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదే అశోక వృక్షం.
లేటెస్ట్ ఫోటోలు
వాస్తు శాస్త్రంలోనే కాదు జ్యోతిష్య శాస్త్రంలో కూడా అశోక వృక్షానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. హిందూ మతం, బౌద్ధ మతంలో అశోక వృక్షానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వేద వ్యాసుడు రచించిన రామాయణం ప్రకారం సీత లంకలో అశోక వృక్షం కిందే కూర్చుందని చెప్పుకొచ్చారు.
అశోక అంటే శోకం లేనిది అని అర్థం. అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. వేదన, దుఖాన్ని తొలగిస్తుంది. అది మాత్రమే కాదు ఈ చెట్టు కామదేవుడిగా భావించే మన్మథుడితో ముడి పడి ఉంటుంది. హిందూ సంస్కృతి ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లలో ఇది ఒకటిగా పరిగణిస్తారు. హిందువులు చైత్ర మాసంలో అశోక వృక్షాన్ని పూజిస్తారు. ఈ చెట్టు ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల శక్తులు దరి చేరవు. వాస్తు దోషాలని తొలగిస్తుంది. మీ చుట్టూ ఉన్న దుఖాన్ని తొలగిస్తుంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయట పడేస్తుంది.
అశోక చెట్టు ఏ దిశలో ఉండాలి
వాస్తు శాస్త్రం ప్రకారం అశోక చెట్టుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉత్తర దిశలో నాటితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి ఆవరణలో అశోక వృక్షాన్ని పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. అశోక చెట్టు ఆకులని శుభ కార్యాలలో ఉపయోగిస్తారు. ఇంటికి ఉత్తర దిశలో ఈ చెట్టు ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు దరిచేరవు. ఈ చెట్టు ఉండటం వల్ల పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు.
వాస్తు దోషాలు తొలగించేందుకు
ఒక శుభ ముహూర్తంలో అశోక చెట్టు వేరు కొద్దిగా తీసి దాన్ని గంగాజలంతో శుభ్రం చేయాలి. ఇప్పుడు ఆ వేరుని పూజా స్థలంలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.
వివాహ దోషాలు తొలగిపోతాయి
చాలా మందికి జాతకంలో మంగళ దోషం లేదా కుజ దోషం ఉండటం వల్ల పెళ్లి కావడం ఆలస్యం అవుతుంది. అటువంటి వారికి ఒకవేళ పెళ్లి జరిగినా కూడా వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ దోష ప్రభావం తగ్గించుకునేందుకు అశోక చెట్టు చక్కని పరిష్కారంగా జ్యోతిష్యులు చెబుతున్నారు. అశోక చెట్టుని నాటడం వల్ల దోషాలు తొలగిపోయి వివాహ ఘడియలు వస్తాయి. సంతోషకరమైన జీవితం పొందుతారు.
పాజిటివ్ ఎనర్జీ
అశోక చెట్టు ఆకులతో తయారు చేసిన తోరణాన్ని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఇది మీ ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మానసిక, శారీరక శక్తిని పెంచుతుంది. అశోక వృక్షం ఉన్న ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉండవు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
అదృష్టం కోసం
ప్రతి మంగళవారం అశోక చెట్టు బెరడుని హనుమంతుడికి సమర్పించడం వల్ల మంగళ దోషం తగ్గుతుంది. అలాగే ఈ చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే మీకు మంచి ఆరోగ్యం, అదృష్టం కలిసి వస్తుంది. ఈ చెట్టు కింద కూర్చుని ధ్యానం, మంత్రాలు పఠించడం వల్ల జీవితంలో విజయం, శ్రేయస్సు మీ సొంతం అవుతాయి. అనారోగ్య సమస్యలు ఉండవు.
ఆర్థిక వృద్ధి కోసం
మంచి రోజున అశోక చెట్టు ఆకులు ఇంటికి తీసుకొచ్చి వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంట్లో భద్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.