Mantras for students: విద్యార్థులు నిత్యం ఈ మంత్రాలు పఠిస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది
Mantras for students: గుర్తు ఉండటం లేదని, చదువులో వెనకబడిపోతున్నారని చాలా మంది విద్యార్థులు బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ప్రతిరోజూ ఈ మంత్రాలు పఠించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
Mantras for students: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల జీవితం ఒత్తిడితో నిండిపోతుంది. ఓ వైపు తల్లిదండ్రుల ఒత్తిడి, మరొక వైపు బాగా చదవలేకపోతున్నామనే భావనతో పిల్లల మనసులు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ మంచి మార్కులు, గ్రేడ్ కోసం ఆరాట పడతారు.
కొంతమంది పిల్లలకు ఎంత చదివినా కూడా జ్ఞాపకం ఉండదు. పరధ్యానం, అయోమయం వల్ల మరికొంతమంది విద్యార్థులు పరీక్షల్లో రాణించలేకపోతారు. అటువంటి వాళ్ళు కొన్ని మంత్రాలు జపించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. లక్ష్యాలని చేరుకోవడం సులభంగా మారుతుంది. మీ పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఈ ఆరు మంత్రాలు వారికి నేర్పించండి. నిత్యం వీటిని పఠిస్తూ ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చదువులో మంచి మార్పులు పొందుతారు.
ఓం
అన్నింటికంటే సులభమైన మంత్రం ఓంకారం. సృష్టిలో ఓంకారం ఎంతో గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. ఓం ఉచ్చరించినప్పుడు వచ్చే కంపనాలు ఉనికిలోని అన్ని శక్తులని ఏకం చేస్తుంది. ఓం జపించడం వల్ల విశ్రాంతి, అంతర్గత శాంతిని ప్రేరేపిస్తుంది. విద్యార్థులు ఏకాగ్రత కోసం ప్రతిరోజూ ఓం జపించడం మంచిది. రోజువారీ అభ్యాసంలో ఓం చేర్చుకోవడం వల్ల వారి చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ ఏకాగ్రతని పెంచుతుంది.
మహా మృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్వార్ రుకమేవ బంధనన్, మృత్యోర్ మోక్షీయ మమృతాత్.
ఈ మహా మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల ధైర్యం వస్తుంది. భయాలు, అడ్డంకులు అధిగమించేందుకు కష్టాలు, క్లిష్ట పరిస్థితులని ఎదుర్కోగల సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల నిర్భయంగా ఉంటారు. ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో పఠించడం వల్ల అధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి సహాయపడుతుంది.
గణేష్ మంత్రం
ఓం గన్ గణపతయే నమః
విఘ్నాలు తొలగించే వాడు వినాయకుడు. అందుకే పూజ సమయంలో తొలి పూజ వినాయకుడికి చేస్తారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు ప్రతి రోజు గణేష్ మంత్రాన్ని పఠించడం వల్ల చదువులో వచ్చే ఆటంకాలు ఏవైనా తొలగిపోతాయి. విద్యార్థులు తమకి ఎదురైన సవాళ్ళని సులభంగా అధిగమించగలుగుతారు.
సరస్వతి మంత్రం
ఓం మహాసరస్వతే నమః
జ్ఞాన స్వరూపిణి సరస్వతీ దేవి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల విద్యార్థులకు సరస్వతీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. విద్యార్థులు తమకి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అవగాహన మెరుగుపరచమని కోరుకుంటూ ఈ మంత్రం పఠిస్తే మంచిది.
ఓం సరస్వతి మాయా దృష్ట్వా, వీణా పుస్తక ధరణిమ్ | హన్స్ వాహిని సమాయుక్తా మా విద్యా దాన్ కరోతు మే ఓం
సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకునే మరొక మంత్రం ఇది. జ్ఞానాన్ని పొందటానికి అమ్మవారి ఆశీర్వాదాలు కోరుతూ ఈ మంత్రం పఠిస్తారు. నేర్చుకునే శక్తిని, జ్ఞాపకశక్తిని మెరుగుపరచమని ఈ మంత్రం ద్వారా వేడుకుంటారు. ఒక విద్యార్థి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తారు.
గాయతీ మంత్రం
ఓం భూర్ భువః స్వాహా తత్సవితుర్ వరేణయం. భర్గో దేవస్య ధీమహి, ధియోర్ యోన ప్రచోదయాత్
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో గాయత్రీ మంత్రం ఒకటి. జ్ఞానోదయం కోసం ప్రజలు జపించే శక్తివంతమైన మంత్రం ఇది. చీకటి, అజ్ఞానాన్ని తొలగించి వెలుగులోకి వచ్చేందుకు ఈ మంత్రం సహాయపడుతుంది. గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు, బుద్ధి శుద్ది అవుతుంది. విద్యార్థులు మంచి ఆలోచనలు చేస్తారు.