తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 13th November 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే సమస్యలు తప్పవు

13 November 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 13వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (13-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

Ego Rasis: ఈ రాశుల వారికి కాస్త ఇగో ఎక్కువే.. ఎవరి మాట వినరండోయ్

May 03, 2024, 03:37 PM

Mercury : బుధుడి కారణంగా ఈ రాశులవారికి మంచి జరగనుంది

May 03, 2024, 03:30 PM

వృషభ రాశిలోకి గురువు.. ఈ రాశుల వారికి ధన లాభం- కానీ..

May 03, 2024, 05:35 AM

మే 3, రేపటి రాశి ఫలాలు.. రేపు భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు అనువైన రోజు కాదు

May 02, 2024, 08:29 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. చికాకులు, ఆటంకములు, గొడవలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం మానేస్తే మంచిది. కుటుంబ సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, స్నేహితుల మధ్య మనస్పర్థలు వస్తాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రతికూల పరిస్థితులు.. వ్యాపారస్తులకు ఒత్తిడి ఉండే సూచనలున్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా.. ధైర్యంతో ముందుకు వెళ్లి విజయం పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించండి.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. మానసిక వేదన, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ధన లాభము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభఫలితాల కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు ఎక్కువగా చేస్తారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకము పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. కానీ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణములు లాభిస్తాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికి మనోధైర్యంతో ముందుకు సాగుతారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధన లాభము, సౌఖ్యము కలుగుతుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి. విద్యార్థులకు, స్త్రీలకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈరోజు అనుకూలముగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఉన్నత అధికారుల మెప్పు పొందుతారు. సమాజములో కీర్తి, కుటుంబములో గౌరవము పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయమిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబములో సమస్యలు తగ్గుతాయి. సమాజంలో కీర్తి కలుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, సౌఖ్యము, కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. మీ కృషితో, పట్టుదలతో ముందుకు వెళ్లి పని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు ఎక్కువగా ఉంటాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు ఆదిత్య హృదయము, నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలముగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయము, నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. కీర్తి, సౌఖ్యము కలుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్