తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : కుటుంబంలో ఆ విషయంలో గొడవలు వచ్చే అవకాశముంది.. జాగ్రత్త

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : కుటుంబంలో ఆ విషయంలో గొడవలు వచ్చే అవకాశముంది.. జాగ్రత్త

10 November 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 10వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (10-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ప్రతి పనిలో చికాకులు ఉంటాయి. పోరాడి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలో మానసిక ఇబ్బందులు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. శత్రువులమీద విజయము సాధిస్తారు. కుటుంబంలో ఖర్చుల విషయంలో గొడవలు వచ్చే అవకాశముంది. అనవసరంగా సలహాలు ఎవరికీ ఇవ్వకండి. ప్రయాణములు అనుకూలిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

మిధున రాశి

మిధున రాశివారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ధన లాభము కలుగుతుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం అధికముగా ఖర్చు చేస్తారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగమునందు, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రయాణములు లాభిస్తాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక ఘర్షణలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. లాభములు కలుగుతాయి. సౌఖ్యము పొందుతారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని ఆరాధించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. శారీరక శ్రమ, పనులు ఎక్కువ అవుతాయి. ప్రయాణములు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ధనలాభము ఉంటుంది. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కుజుని ప్రభావంచేత భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు ఉంటాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యము కుదుటపడుతుంది. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచి జాగ్రత్తగా చేయడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం.. దత్తాత్రేయుని పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఆర్ధిక సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. కొన్ని సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. శత్రువుల బాధలు ఇబ్బంది పెడతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. కానీ ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్