తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు కుటుంబముతో చర్చలకు దూరంగా ఉంటే మంచిది..

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు కుటుంబముతో చర్చలకు దూరంగా ఉంటే మంచిది..

06 November 2022, 5:00 IST

google News
    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 6వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (06-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం వచ్చే సూచన ఉంది. కష్టపడితే కాని పనులు పూర్తి కాని పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువుల వలన చికాకులు ఏర్పడుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. విభేదాలకు దూరంగా ఉంటే మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకం పఠించండి.

వృషభ రాశి

ఈరోజు మధ్యస్తం నుంచి అనుకూలంగా ఉంది. ఇష్టమైన వస్తువులు కొంటారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. మానసిక అలసట ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. భేదాభిప్రాయ సూచనలు ఎక్కువగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మిధున రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. కుటుంబముతో ఆహ్లాదముగా గడుపుతారు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ పెరుగుతుంది. పనుల్లో చికాకులు ఉంటాయి. ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించండి. ప్రయాణమునందు ఖర్చులు అధికమగు సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మిధునరాశివారు ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కర్కాటక రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. విశ్రాంతి దొరుకుతుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

సింహ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఏ విషయాలు గురించి ఎక్కువగా ఆలోచించకండి. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కన్యా రాశి

ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. శారీరక సౌఖ్యం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. విశ్రాంతి పొందుతారు. శరీర సౌఖ్యం కోసం అధికముగా ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగుతుంది. ధనలాభము పొందుతారు. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇష్టమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎదుటి వారి మన్నన పొందటానికి ప్రయత్నం చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి.

ధనూ రాశి

ఈరోజు మధ్యస్త ఫలితాలున్నాయి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కుటుంబముతో గడుపుతారు. కావలసిన వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. కుటుంబములో చికాకులు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము, ప్రశాంతత కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఆరోగ్యం, కుటుంబం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయము, నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

ఈరోజు మీకు మధ్యస్థమునుంచి అనుకూలంగా ఉంది. అవసరమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రులతో గడుపుతారు. కుటుంబములో చికాకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. ఖర్చులు పెరుగుతాయి. రాబడి తగ్గుతుంది. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగము కోసము చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయము, నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్

తదుపరి వ్యాసం