తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : నువ్వుల నూనెతో శివునికి దీపారాధన చేస్తే ఆ రాశులవారికి మంచిది

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : నువ్వుల నూనెతో శివునికి దీపారాధన చేస్తే ఆ రాశులవారికి మంచిది

05 November 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 5వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (05-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

Ego Rasis: ఈ రాశుల వారికి కాస్త ఇగో ఎక్కువే.. ఎవరి మాట వినరండోయ్

May 03, 2024, 03:37 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ప్రతి పనియందు చికాకులు అధికముగా ఉంటాయి. పోరాడి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. స్త్రీలకు కుటుంబంలో మానసిక ఇబ్బందులు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృషభ రాశి

వృషభరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. శత్రువులమీద విజయము సాధిస్తారు. కుటుంబ ఖర్చులతో గొడవలు ఏర్పడతాయి. అనవసరంగా సలహాలు ఎవరికి ఇవ్వకండి. ప్రయాణములు అనుకూలిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

మిధున రాశి

మిధునరాశివారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. మరింత శుభఫలితాల కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన చేయడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగుతాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రయాణములు లాభిస్తాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి పెరుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికి మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయము పొందుతారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

తులా రాశి

తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక ఘర్షణలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగమునందు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. శత్రువులతో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి

వృశ్చికరాశికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. శారీరక శ్రమ, పనులు అధికమగుతాయి. ప్రయాణములు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము ఉంటుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కుజుని ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు కలుగుతాయి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేయండి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగుతాయి. నువ్వులనూనెతో దీపారాధన చేయండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఆర్ధిక సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగము నందు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. కొంత కాలంగా ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శనికి తైలాభిషేకం చేసి.. దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం పఠిస్తే శుభ ఫలితము ఉంటుంది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000