Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి.. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు-today horoscope in telugu based on career and life for 4th november 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి.. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి.. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 04, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 4వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (04-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ఈరోజు చేసే ప్రతీ పని శుభ ఫలితాలనిస్తుంది. ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. తెలివితేటలతో ముందుకు సాగండి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభము చేకూరుతుంది. శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ కలహాలు ఏర్పడతాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. బంధుమిత్రుల ప్రశంసలు లభిస్తాయి. శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధించండి.

మిథున రాశి

మిథున రాశివారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబములో సమస్యలు.. తద్వార ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆందోళన, ఇబ్బందులు పెరుగుతాయి. వ్యాపారము, ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు ఉంటాయి. స్త్రీలతో జాగ్రత్త ఉండండి. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగము, వ్యాపారాల్లో లాభము ఉంటుంది. ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించండి.

కన్యారాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి పెరుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ధన సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికి మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయము సాధిస్తారు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబం పట్ల శ్రద్ధ వహించండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. శత్రువులతో జాగ్రత్త. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి. స్త్రీలకు కుటుంబములో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శుభఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము ఉంటుంది. సమాజంలో కీర్తి, గౌరవము పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము కలుగుతుంది. సమాజములో కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరక సౌఖ్యం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కృషి, పట్టుదలతో ముందుకు వెళ్లి పనులు పూర్తి చేస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొంత కాలంగా ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్