Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : కుజుని ప్రభావంతో.. ఒత్తిడి, కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం-today horoscope in telugu based on career and life for 3rd november 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : కుజుని ప్రభావంతో.. ఒత్తిడి, కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : కుజుని ప్రభావంతో.. ఒత్తిడి, కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 03, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 3వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (03-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ప్రతి పనిలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. పోరాడి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు మధ్యస్థ సమయము. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. మరింత శుభఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. శత్రువులమీద విజయము సాధిస్తారు. కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అనవసరంగా సలహాలు ఇవ్వడం మానుకోండి. ప్రయాణములు అనుకూలిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మిధున రాశి

మిధున రాశివారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. కుజుని ప్రభావంచేత మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయి. పనులయందు చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగుతుంది. మిధునరాశి వారికి ఈవారం ధన లాభము ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం అధికముగా ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగుతుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి పెరుగుతుంది. అనుకున్న పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

తులా రాశి

తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక ఘర్షణలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని ఆరాధించండి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. శారీరక శ్రమ, పనులు అధికమవుతాయి. ప్రయాణములు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయము. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. మీ కృషితో, పట్టుదలతో ముందుకు వెళ్లి పనులు పూర్తి చేస్తారు. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దత్తాత్రేయుని పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఖర్చులు నియంత్రించుకోండి. ఉద్యోగములో లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొంత కాలంగా ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దక్షిణామూర్తిని పూజించండి.

మీన రాశి

మీన రాశి వారికి మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్