Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ధనలాభము, కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది
Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 2వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (02-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధించడం మంచిది.
వృషభ రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.
మిధున రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము దొరుకుతుంది. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణము వల్ల ఖర్చులు ఎక్కువయ్యే సూచన ఉంది. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యమును పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తగ్గుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
సింహ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పవు. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
కన్యా రాశి
ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీర శ్రమ, మానసిక ఒత్తిడి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. శరీర సౌఖ్యం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగుతుంది. ధనలాభము పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. స్నేహితులు హెల్ప్ చేస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం తులారాశి వారు మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగములో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములున్నాయి. ధనలాభము, కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం వృశ్చికరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
ధనూ రాశి
ఈరోజు మీకు మద్యస్తమునుంచి అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
మకర రాశి
ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి.. ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించండి. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.
కుంభ రాశి
ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలోని వారితోటి ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉన్నది. ప్రతీ పనిని ఆచితూచి చేయాల్సిన సమయమిది. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
మీన రాశి
ఈరోజు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితములున్నాయి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
సంబంధిత కథనం
టాపిక్