తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తే ఆ రాశుల వారికి మంచిది..

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తే ఆ రాశుల వారికి మంచిది..

09 November 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 9వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (09-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

మే 8, రేపటి రాశి ఫలాలు.. కొత్తగా వ్యాపారాన్ని చేపట్టాలనుకునే వారి కోరిక తీరుతుంది

May 07, 2024, 08:45 PM

Mars Transit : కుజుడి దయతో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతాలు.. విక్టరీ మీ సొంతం

May 07, 2024, 04:07 PM

Shukraditya Raja yogam 2024: శుక్రాదిత్య రాజయోగం: ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుదలతో పాటు చాలా లాభాలు

May 07, 2024, 03:43 PM

ఈ రాశుల వారికి టైమ్​ వచ్చింది- భారీ ధన లభాం, ఉద్యోగంలో ప్రమోషన్​.. అనుకున్నది సాధిస్తారు!

May 07, 2024, 05:50 AM

మే 7, రేపటి రాశి ఫలాలు.. రేపు వీరికి ఆదాయం ఫుల్, మనసు ఖుషీగా ఉంటుంది

May 06, 2024, 08:31 PM

Malavya Rajyog 2024: మాలవ్య రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టం! ఆర్థిక లాభాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు

May 06, 2024, 04:49 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

వృషభ రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. శారీరక శ్రమ, మానసిక ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

మిధున రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. కానీ మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము కలుగుతుంది. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణమునందు ఖర్చులు ఎక్కువ అవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

కర్కాటక రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

సింహ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

కన్యా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. శరీర శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగుతుంది. ధనలాభము పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సౌఖ్యము పొందుతారు. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయము పొందుతారు. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగములో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు ఉంటాయి. ధనలాభము, కుటుంబ సౌఖ్యము ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ధనూ రాశి

ఈరోజు మీకు మద్యస్తమునుంచి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి.. ప్రతి పని ఆచితూచీ చేయండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

కుంభ రాశి

ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలోని వారితో ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై ఎక్కువగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి చేయాల్సిన సమయమిది. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగమునందు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

మీన రాశి

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితములున్నాయి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్