తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 12th November 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు.. జాగ్రత్తగా ఉండండి..

12 November 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 12వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (12-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

వృషభ రాశిలోకి గురువు.. ఈ రాశుల వారికి ధన లాభం- కానీ..

May 03, 2024, 05:35 AM

మే 3, రేపటి రాశి ఫలాలు.. రేపు భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు అనువైన రోజు కాదు

May 02, 2024, 08:29 PM

Saturn retrograde: శని తిరోగమనం.. ఐదు నెలల వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు

May 02, 2024, 07:05 PM

మే 2, రేపటి రాశి ఫలాలు.. రేపు రాజకీయ నాయకులకు కష్టసమయం, శత్రువులను గుర్తించండి

May 01, 2024, 08:31 PM

Shukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే, కోరికలు నెరవేరతాయి

May 01, 2024, 02:35 PM

మే 1, రేపటి రాశి ఫలాలు.. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి, ఎవరినీ చూసి మోసపోవద్దు

Apr 30, 2024, 09:06 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు. ప్రతి పనిలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. పోరాడి పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు మానసికంగా ఇబ్బందులు ఉంటాయి ఖర్చులు అదుపులో ఉంచుకోండి. శని కుజ శుక్రుల అనుకూల స్థితి వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. శత్రువులమీద విజయము సాధిస్తారు. ఇతరులకు సలహాలు ఇవ్వకుండా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

మిధున రాశి

మిధున రాశివారికి ఈ రోజు మధ్యస్తముగా ఉంటుంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. మరింత శుభఫలితాల కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితాలు కలుగుతాయి. కొన్ని సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రయాణములు లాభిస్తాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఒత్తిడి ఉన్నప్పటికీ.. మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయము పొందుతారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక ఘర్షణలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. లాభములు కలుగుతాయి. సౌఖ్యము పొందుతారు. శత్రువులతో జాగ్రత్త ఉండండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రుల హెల్ప్ చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. శారీరక శ్రమ, పనులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము ఉంటుంది. సమాజంలో కీర్తి, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. కానీ భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు కలుగుతాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. సమాజములో కీర్తి కలుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠిస్తే మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యము కుదుటపడుతుంది. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి చేసే ప్రతి పనిని ఆచితూచీ జాగ్రత్తగా చేయండి. ఈరోజు శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. కొంత కాలంగా ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. శనికి తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం చదివితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్