తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 11th November 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది

11 November 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 11వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (11-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

మే 3, రేపటి రాశి ఫలాలు.. రేపు భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు అనువైన రోజు కాదు

May 02, 2024, 08:29 PM

Saturn retrograde: శని తిరోగమనం.. ఐదు నెలల వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు

May 02, 2024, 07:05 PM

మే 2, రేపటి రాశి ఫలాలు.. రేపు రాజకీయ నాయకులకు కష్టసమయం, శత్రువులను గుర్తించండి

May 01, 2024, 08:31 PM

Shukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే, కోరికలు నెరవేరతాయి

May 01, 2024, 02:35 PM

మే 1, రేపటి రాశి ఫలాలు.. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి, ఎవరినీ చూసి మోసపోవద్దు

Apr 30, 2024, 09:06 PM

Gajakesari Raja Yoga : గజకేసరి రాజ యోగం.. వీరికి అన్ని విధాలుగా సూపర్

Apr 30, 2024, 02:10 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. చేసే ప్రతీ పని శుభ ఫలితాలనిస్తుంది. ఆర్ధిక విషయాల పట్ల జాగ్రత్త వహించండి. చికాకులు, ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. అయినా సరే మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. కుటుంబంలోని సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాములు చేకూరును. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కుజుని ప్రభావంచేత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబములో గొడవలు జరుగుతాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. బంధుమిత్రుల ప్రశంసలు పొందుతారు. ఆనందము కలుగుతుంది. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

మిథున రాశి

మిథున రాశివారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబమునందు సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆందోళన, ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారము, ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చికాకులు ఎక్కువగా ఉంటాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితాలు కలుగుతాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబము నందు కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంనందు జాగ్రత్తగా ఉండండి. మరింత శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. మీరు అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికి మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయము పొందుతారు. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించండి. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండండి. ప్రయాణములు అనుకూలిస్తాయి. సౌఖ్యము పొందుతారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రులు సహాయం చేస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము కలుగుతుంది. సమాజము నందు కీర్తి, కుటుంబము నందు గౌరవము పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము కలుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమిది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటే ఇంకా మంచిది. శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరక సౌఖ్యం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి. మీ కృషితో, పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం అలాగే ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంజి. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించవలన శుభ ఫలితము కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్