Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు మంచి జరగాలంటే.. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి..
12 October 2022, 5:00 IST
- Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 12వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలితాలు
Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (12-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక, మానసిక ఒత్తిడి అధికమగును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయండి.
వృషభ రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది. మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
మిధున రాశి
ఈరోజు మీకు అంతా అనుకూలంగా ఉంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము కలుగుతుంది. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణములో ఖర్చులు ఎక్కువ అవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. డబ్బులు అధికముగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
సింహ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
కన్యా రాశి
ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీర శ్రమ, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంది. ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. శరీర సౌఖ్యం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. మానసిక ఆనందం పొందుతారు. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము పొందుతారు. అప్పుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగములో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
ధనూ రాశి
ఈరోజు మీకు మద్యస్తమునుంచి అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
మకర రాశి
ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు ఎక్కువ అవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పనిని ఆచితూచీ చేయడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.
కుంభ రాశి
ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలోని వారితో ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శత్రువుల బాధలు ఎక్కువ అవుతాయి. ఉద్యోగములో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
మీన రాశి
ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలున్నవి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000