సెప్టెంబర్ 22, నేటి రాశి ఫలాలు- వీరికి ఆస్తి వివాదాలు, రుణ బాధల నుంచి విముక్తి
22 September 2024, 0:01 IST
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 22.09.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
సెప్టెంబర్ 22 నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 22.09.2024
లేటెస్ట్ ఫోటోలు
వారం: ఆదివారం, తిథి : పంచమి,
నక్షత్రం: కృతిక, మాసం: భాద్రపదము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడి రుణ బాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వాహనసౌఖ్యం ఉంది. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విశేష గౌరవం లభిస్తుంది. బంధువిరోధాలు ఉన్నాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు కలిసి వస్తాయి. ఆంజనేయ దండకం పఠించండి.
వృషభం
కొత్త పనులు చేపడతారు. ఆలోచనల అమలుకు చర్యలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉన్నాయి. ధనవ్యయం ఉంది. గులాబీ, నీలం రంగులు కలిసి వస్తాయి. దేవీఖడ్గమాల పఠించండి.
మిథునం
నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో రాజీపడరు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. అనారోగ్య సూచనలు ఉన్నాయి. నేరేడు, ఆకుపచ్చ రంగులు ధరించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగు పడుతుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయట పడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు తీరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. బంధువిరోధాలు సూచనలు ఉన్నాయి. గులాబీ, తెలుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.
సింహం
శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ధనవ్యయం సూచనలు ఉన్నాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు కలిసి వస్తాయి. లక్ష్మీస్తుతి మంచిది.
కన్య
ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారి సేవలు గుర్తింపు పొందుతాయి. వ్యయ ప్రయాసలు ఉన్నాయి. మిత్రులతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు ధరించండి. శివాష్టకం పఠించండి.
తుల
చేపట్టిన వ్యవహారాలు కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. పారిశ్రామికవర్గాల యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. వ్యయ ప్రయాసలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది.
వృశ్చికం
మీ అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పవచ్చు. ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. అనారోగ్య సూచనలు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. విద్యార్థులకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. ఆకస్మిక ధన, వస్తులాభాలు ఉన్నాయి. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గామాతకు అర్చన చేయండి.
మకరం
పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సత్కారాలు. ధనవ్యయ సూచనలు ఉన్నాయి. గులాబీ, లేత పసుపు రంగులు కలిసి వస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వ్యయ ప్రయాసలు ఉన్నాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.
మీనం
ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాల కొనుగోలు. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. నేరేడు, తెలుపు రంగులు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.