Kalawa thread: చేతికి ఎరుపు రంగు దారం ఎందుకు కడతారు? అది ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు?-why do tie red thread with wrist how many days can it be kept ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kalawa Thread: చేతికి ఎరుపు రంగు దారం ఎందుకు కడతారు? అది ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు?

Kalawa thread: చేతికి ఎరుపు రంగు దారం ఎందుకు కడతారు? అది ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు?

Gunti Soundarya HT Telugu
Jul 05, 2024 11:07 AM IST

Kalawa thread: చాలా మంది చేతులకు ఎరుపు పసుపు మిళితమైన దారం కట్టుకుని ఉంటారు. అయితే దీన్ని ఎందుకు కట్టుకుంటారు? దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఎన్ని రోజులకు ఈ దారాన్ని తొలగించవచ్చో తెలుసుకుందాం.

చేతికి ఎరుపు రంగు దారం ఎందుకు కట్టుకుంటారు?
చేతికి ఎరుపు రంగు దారం ఎందుకు కట్టుకుంటారు? (pinterest)

Kalawa thread: కల్వ, రక్ష సూత్రం, మౌలి, రాఖీ మొదలైనవి హిందువులు తమ చేతి మణికట్టు చుట్టూ కట్టుకునే పవిత్రమైన దారం. పూజ చేసేటప్పుడు లేదా రాఖీ సమయంలో దీన్ని కట్టుకుంటారు. ఇది రక్షణ శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ప్రతికూల శక్తులు, దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందేందుకు ఇది ఎక్కువగా కట్టుకుంటారు.

మణికట్టుకు కాలవను కట్టుకోవడం వల్ల సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళను గుర్తిస్తుంది. ఎరుపు, నారింజ లేదా పసుపు రంగు దారం ఎక్కువ మంది చేతికి ఉంటుంది. ఇది ఐక్యతకు చిహ్నం. ఇది కేవలం ఒక రంగు దారం కాదు లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఈ దారం కట్టుకోవడం వెనుక ఒక కథ కూడా పురాణాలలో ఉంది.

ద్రౌపది శ్రీకృష్ణుడికి కట్టింది

ఒకసారి శ్రీకృష్ణుడి మణికట్టుకు అనుకోకుండా గాయమైంది. రక్తస్రావం ఆపేందుకు ద్రౌపది తన వస్త్రంలోని కొంత భాగాన్ని చించి శ్రీకృష్ణుడి మణికట్టుకు కడుతుంది. ఆసంజ్ఞతో ద్రౌపదిని తాను ఎప్పటికీ రక్షిస్తానని ఆమెకు ఎప్పటికీ వస్త్రాల కొరత రాదని హామీ ఇచ్చాడు. చీర ఒక పవిత్రమైన దారంగా పనిచేస్తుంది. అందుకే ద్రౌపది వస్త్రాహరణంలో దుశ్శాసనుడు ఆమె చీరను లాగేందుకు ప్రయత్నించగా ఆ చీర అయిపోకుండా శ్రీకృష్ణుడు చూశాడు.

రాఖీ రూపంలో కల్వ

కల్వను రాఖీ రూపంగా కూడా పిలుస్తారు. రక్షాబంధన్ గుర్తుగా కూడా దీన్ని కడతారు. ఈ పండుగ సందర్భంగా అమ్మాయిలు తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కడతారు. వారి సోదరుడు చెడు నుంచి వారిని కాపాడుతానని వాగ్దానం చేస్తాడు.

రక్షా సూత్రంగా కూడా కల్వను సూచిస్తారు. వేడుకల సమయంలో పూజారులు పురుషులు స్త్రీలు ఒకరికొకరితో మణికట్టు మీద రక్షా సూత్రాన్ని కట్టిస్తారు. ఇది ఒక ఆశీర్వాదంగా కనిపిస్తుంది. యజ్ఞం, పూజ, సంకల్పం మరెన్నో ఆచారాలలో దీన్ని పాటిస్తారు. రక్షా సూత్రం ధరించే వారికి ఏ విధమైన ప్రతికూలతలు, అడ్డంకులు ఉండవు.

శాస్త్రీయ కారణం

మణికట్టుకు దారం కట్టడం వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఇది ప్రత్యేకంగా పల్స్ దగ్గర కడతారు. మానవునిపై శారీరక, ఆధ్యాత్మిక ప్రభావం ఇది చూపుతుందని నమ్ముతారు. మణికట్టు సున్నితమైన ప్రాంతంగా భావిస్తారు. ఈ దారం కట్టడం వల్ల నాడీ వ్యవస్థపై ఓదార్పు ప్రభావం కలుగుతుంది. శరీరం శక్తులను సమతుల్యం చేస్తుంది. ప్రశాంతతను ఇవ్వడంలో ప్రోత్సహిస్తుంది. ధ్యానం, ప్రార్థన సమయంలో ఏకాగ్రతను తీసుకొస్తుంది.

ఎన్ని రోజులు ధరించాలి

సాంప్రదాయకంగా కల్వను 21 రోజుల ధరించడం మంచిది. ఆ తర్వాత ఇది రంగు పోవడం ప్రారంభమవుతుంది. అలా అవుతున్నప్పుడు దానిలోనే రక్షాశక్తులు కూడా మసకబారతాయని చెబుతారు. పూజ సమయంలో కల్వ ధరించిన వాళ్ళు సానుకూల శక్తులతో ఉంటాయి. ఇది రంగు పోయినప్పుడు అటువంటి సమయంలో కొత్తదాన్ని కట్టుకోవడం మంచిది.

చేతి నుంచి తొలగించిన కల్వను ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు. దాన్ని భద్రంగా, గౌరవప్రదంగా ఉంచడం ముఖ్యం. కల్వను ధరించిన వ్యక్తి కి ఉన్న శక్తి అందులో ఉన్నందున దానిని ఎవరైనా దుర్వినియోగం చేయవచ్చు. అందుకే ఈ దారాన్ని పవిత్ర చెట్టుకు కట్టాలి. లేదంటే ఇసుకలో పాతి పెట్టాలి. ఇలా చేయడం వల్ల శక్తుల సమతుల్యతను కాపాడినట్లు అవుతుంది. కొంతమంది తులసి మొక్క దగ్గర పాతి పెట్టుకుంటారు అది కూడా మంచి అలవాటు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.