Lord shiva: శ్రావణ మాసంలో ఈ ఆలయాలు దర్శించుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి-if you visit these temples in the month of sravana masam chronic diseases will be cured ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Shiva: శ్రావణ మాసంలో ఈ ఆలయాలు దర్శించుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి

Lord shiva: శ్రావణ మాసంలో ఈ ఆలయాలు దర్శించుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి

Gunti Soundarya HT Telugu
Aug 05, 2024 08:22 AM IST

Lord shiva: నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు శివునికి చెందిన ఈ ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటే మంచిది. వైద్యనాథ్ గా పేరుగాంచిన మహాదేవుడి ఆలయాలు ఏవో తెలుసుకోండి.

శ్రావణ మాసంలో దర్శించుకోవాల్సిన ఆలయాలు
శ్రావణ మాసంలో దర్శించుకోవాల్సిన ఆలయాలు (pixabay)

Lord shiva: హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఐదవ నెల శ్రావణ మాసం. అత్యంత పవిత్రమైన ఈ మాసం మహా విష్ణువుతో పాటు శివునికి ఎంతో ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు క్రమం తప్పకుండా శివారాధన చేస్తారు. శ్రావణ మాసం వ్రతాలు, పూజలతో దైవికమైనదిగా ఉంటుంది.

శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించడం వల్ల భక్తుడి సకల కోరికలు నెరవేరతాయి. వైద్యనాథుడు అనే పేరు కూడా మహా దేవుడికి ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యాలను నయం చేయగలిస్తే శక్తి ఉందని భక్తుల విశ్వాసం. ఈ శ్రావణ మాసంలో మీరు అనారోగ్యాలతో బాధపడుతున్నట్టయితే శివునికి చెందిన ఈ ప్రముఖ ఆలయాలను సందర్శించండి. అనారోగ్యాలు, రోగాలు నయం చేసే ఆ ఆలయాలు ఏవో చూద్దాం.

మహాకాళేశ్వర ఆలయం, ఉజ్జయిని

భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మహా కాళేశ్వర్ ఆలయం శివునికి అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటిగా నిలిచింది. ఉజ్జయినిలో ఉన్న ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ మహా కాళేశ్వరుడు. అకాల మరణం నుంచి రక్షించే శక్తి, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంటాడని నమ్ముతారు. దీర్ఘాయువు ఇవ్వమని కోరుకుంటూ భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

వైద్యనాథ్ ఆలయం, జార్ఖండ్

శివునికి చెందిన జ్యోతిర్లింగ క్షేత్రం వైద్యనాథ్ ఆలయం. పురాణాల ప్రకారం శివుడిని తనతో కలిసి లంకకు రమ్మని రావణుడు కోరాడు. అప్పుడు శివుడు ఒక షరతుతో అంగీకరించాడు. లంక చేరేలోపు శివలింగాన్ని నేలపై ఎక్కడైనా పెడితే మళ్ళీ పైకి లేవనని చెప్పాడట. కానీ అనుకోకుండా రావణుడు శివలింగాన్ని కింద పెట్టాడు. అది దేవఘర్ లో ఉంది. వైద్యనాథ్ అంటే వైద్యాలను నయం చేసే దేవుడిగా కొలుస్తారు. ఇక్కడ పరమేశ్వరుడికి పూజలు చేస్తే వివిధ వ్యాధులు, రోగాలు నయమవుతాయని నమ్మకం.

వైతీశ్వరన్ కోయిల్, తమిళనాడు

పుల్లిరుక్కువేలూర్ అనే పిలిచే వైతీశ్వరన్ కోయిల శివుడిని వైతీశ్వరుడిగా కొలుస్తారు. అంటే దీని అర్థం దైవ వైద్యుడు. ఈ దేవాలయం వైద్యం చేసే శక్తికి ప్రసిద్ధి చెందింది. చర్మ వ్యాధులు, ఇతర రోగాలు ఉన్న వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే నయం అవుతాయని నమ్ముతారు. ఈ ఆలయ సముదాయంలో ఉన్న సిద్ధామృతం ట్యాంక్ లోని పవిత్ర జలంతో ఒక్కసారి స్నానం చేస్తే రోగాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు.

కాశీ విశ్వనాథ ఆలయం, వారణాసి

భూమిపై అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి వారణాసిలోకి కాశీ విశ్వనాథ ఆలయం. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఒక వ్యక్తిని మానసికంగా, శారీరకంగా నయం చేయగల శక్తివంతమైన ఆలయం ఇది. శివుడిని పూజించడం వల్ల శారీరక, ఆధ్యాత్మిక స్వస్థత చేకూరుతుందని నమ్ముతారు.

రామేశ్వర ఆలయం, తమిళనాడు

వైద్య గుణాలు కలిగిన శక్తివంతమైన జ్యోతిర్లింగాలలో మరొకటి రామనాథ స్వామి దేవాలయం. రామేశ్వరం ఆలయంలో 22 తీర్థాలు ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఈ తీర్థాలలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఇక్కడ నీటితో స్నానం చేయడం వల్ల వ్యాధులు నయం అవుతుందని ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. గాయత్రీ, సావిత్రయి తీర్థం ఆత్మను శుద్ధి చేసేందుకు శరీరాన్ని అంటూ వ్యాధుల నుంచి నయం చేసేందుకు సహాయపడుతుందని నమ్ముతారు.

కన్హిరానగడ్ వైద్యనాథ ఆలయం, కేరళ

కేరళలోని కన్హిరానగడ్ వైద్యనాథ ఆలయంలోని శివుడిని వైద్య నాథుడిగా పూజిస్తారు. ఇక్కడ ఆలయాన్ని దర్శించుకుంటే మానసిక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని చెబుతారు. ముఖ్యంగా సోమవారాల్లో ఇక్కడ పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తే బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.