తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: శని ప్రభావం.. ఈ రాశుల జాతకులకు ఇది కష్టాల సమయం

Saturn transit: శని ప్రభావం.. ఈ రాశుల జాతకులకు ఇది కష్టాల సమయం

Gunti Soundarya HT Telugu

06 February 2024, 16:56 IST

google News
    • Saturn transit: శని ఈ ఏడాది మొత్తం కుంభ రాశిలోనే ఉంటాడు. తన రాశి మార్చనప్పటికీ కదలికలో మాత్రం మార్పులు ఉంటాయి. శని అస్తంగత్వం వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలు రాబోతున్నాయి. 
కుంభరాశిలో శని అస్తమయం
కుంభరాశిలో శని అస్తమయం

కుంభరాశిలో శని అస్తమయం

Saturn transit: న్యాయదేవుడు శనిని చూసి అందరూ భయపడతారు. కర్మల అనుసారం శని ఫలితాలు ఇస్తాడు. అందుకే నవ గ్రహాలలో శని గ్రహం చాలా ప్రత్యేకం. శని ప్రభావం ఉంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శని దేవుడి అశుభ దృష్టి ఉన్న వాళ్ళకి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అదే శని అనుగ్రహం ఉంటే చేపట్టిన ప్రతి పనిలో విజయం మిమ్మల్నే వరిస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- ఆర్థిక కష్టాలు దూరం, ఉద్యోగంలో ప్రమోషన్​

Dec 22, 2024, 12:06 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

రెండున్నర ఏళ్లకి ఒకసారి రాశి మారుస్తాడు శని దేవుడు. గత ఏడాది అక్టోబర్‌లో కుంభ రాశిలోకి ప్రవేశించిన శని దేవుడు 2025 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. తన రాశిని మారనప్పటికీ స్థానం మాత్రం మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు అస్తంగత్వం చెందుతాడు. మరికొన్నిసార్లు దేదీప్యమానమవుతాడు. ఇంకొకసారి తిరోగమన దిశలో సంచరిస్తూ ఉంటాడు.

ఫిబ్రవరి 11 నుంచి మార్చి 18 వరకు శని దేవుడు కుంభ రాశిలో అస్తంగత్వం చెందబోతున్నాడు. దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద పడుతుంది. కానీ మూడు రాశుల వాళ్ళు మాత్రం శని వల్ల ప్రతికూల ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రాశులు ఏవంటే..

కన్యా రాశి

శని దేవుడు మరికొన్ని రోజుల్లో కుంభ రాశిలో అస్తంగత్వం చెందడం వల్ల కన్యా రాశి వారికి కష్టాల సమయం తీసుకురాబోతుంది. శని దేవుడి అస్తమయం ఈ రాశి వారికి ప్రతికూల ప్రభావం ఉండబోతుంది. ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తుతాయి. కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. నాభి ప్రాంతం శని దేవుడి స్థానం అంటారు. అందుకే నాభి ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రాశి వారి జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంది. ఒత్తిడికి గురవుతారు. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మనసుని ఏకాగ్రతగా ఉంచుకోవాలి. ఏదైనా పనికి అధిక ప్రాధాన్యత ఇవ్వొద్దు.

కుంభ రాశి

శని స్వక్షేత్రం అయిన కుంభ రాశిలోనే అస్తమించడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా లేదు. ఈ రాశి జాతకులు సడే సాతీ ప్రభావంతో బాధపడతారు. ప్రయాణ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని చర్చలలో తలదూర్చకపోవడం మంచిది. చట్టపరమైన కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. దైవారాధన తప్పనిసరిగా చేయాలి.

మీన రాశి

ఈ రాశి వారికి శని అస్తమించడం వల్ల సమస్యలు ఎదురుకాబోతున్నాయి. వ్యాపారస్తులు ఈ సమయంలో పొరపాటున కూడా పెట్టుబడులు పెట్టకూడదు. అలా చేస్తే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదు. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి జాగ్రతగ్గా ఉండాలి. మనసు అస్థిరంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొని దైవారాధన చేయండి.

శని దేవుడి అశుభ ప్రభావం తగ్గించుకునేందుకు శమీ మొక్కని పూజిస్తే మంచిది. ప్రతి శని వారం శమీ మొక్క దగ్గర దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు దానం చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు.

తదుపరి వ్యాసం