Mercury combustion: ఆ రాశి నుంచి బుధుడు అస్తమయం.. ఈ రాశుల జాతకులకు గడ్డు కాలమే-mercury transit combustion in makara rashi these zodiac signs get trouble in their life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Combustion: ఆ రాశి నుంచి బుధుడు అస్తమయం.. ఈ రాశుల జాతకులకు గడ్డు కాలమే

Mercury combustion: ఆ రాశి నుంచి బుధుడు అస్తమయం.. ఈ రాశుల జాతకులకు గడ్డు కాలమే

Gunti Soundarya HT Telugu

Mercury combustion: మకర రాశి ప్రవేశం చేసిన బుధుడు త్వరలో ఆ రాశిలో అస్తమించబోతున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశుల మీద శుభ, అశుభ ప్రభావం చూపుతుంది.

బుధుడు అస్తమయం

Mercury combustion: శనికి చెందిన మకర రాశిలోకి గ్రహాల రాకుమారుడు బుధుడు ఫిబ్రవరి 1న ప్రవేశించాడు. జ్ఞానం, తెలివితేటలు, కమ్యూనికేషన్స్ కి బుధుడు కారకుడిగా చెప్తారు. గ్రహాలు రాశి మార్పుతో పాటు అవి కొంత సమయం తర్వాత అస్తమిస్తాయి. బుధుడు ఫిబ్రవరి 8న మకర రాశిలో అస్తమించబోతున్నాడు. మార్చి నెల వరకు బుధుడు ఈ స్థితిలోనే ఉంటాడు.

సాధారణంగా ఏదైనా ఒక గ్రహం అస్తమించినప్పుడు అశుభ ఫలితాలు ఇస్తుంది. బుధుడు, శని మిత్రగ్రహాలు. అందువల్ల బుధుడు అస్తమయం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతుంది. కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటి ప్రభావం ఈ రాశుల మీద పెద్దగా కనిపించదు. ఏయే రాశుల మీద బుధుడు అస్తమయం సానుకూల ప్రభావం చూపుతుందంటే..

వృషభం

బుధుడు వృషభ రాశి తొమ్మిదో ఇంట్లో అస్తమిస్తాడు. బుధుడు దహన స్థితి ఈ రాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు దక్కుతాయి.

కర్కాటక రాశి

గ్రహాల రాకుమారుడు బుధుడు కర్కాటక రాశి ఏదో ఇంట్లో అస్తమిస్తాడు. ఈ ప్రభావం కర్కాటక రాశి వారి మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. కష్టపడి పని చేస్తే ఉద్యోగం చేసే చోట మరింత గుర్తింపు పొందుతారు. కెరీర్ లో ఎదగడం కోసం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. మీ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు సహాయ సహకారాలు అందుతాయి.

మకర రాశిలో బుధుడు అస్తమించడం ఈ రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. ఆ రాశులు ఏవంటే..

సింహ రాశి

సింహ రాశి ఏడో ఇంట్లో బుధుడు అస్తమించనున్నాడు. విదేశాలకి వెళ్లాలని అనుకునే వారికి చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం అధిరోహించాలని అనుకుంటారు కానీ అది సాధ్యపడదు. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. వ్యాపారస్తులకి ఇది గడ్డు కాలం. ధన నష్టం ఉంటుంది.

కన్యా రాశి

బుధుడు వృశ్చిక రాశి మూడో ఇంట్లో అస్తమిస్తాడు. కెరీర్, ఉద్యోగ పరంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల ప్రవర్తన మీ పట్ల సంతృప్తికరంగా ఉండదు. వ్యాపారంలో ఆకస్మిక నష్టాలు, ఎదురుదెబ్బలు తగులుతాయి. మీ పోటీదారుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి రెండో ఇంట్లో బుధుడు దహనం అవుతాడు. కెరీర్ లో సవాళ్ళు ఎదురవుతాయి. సహోద్యోగుల నుంచి అడ్డంకులు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు పోటీదారుల నుంచి కఠినమైన పోటీ ఎదుర్కొంటారు. మితమైన లాభాలు కూడా రాకపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.

మిథునం

బుధుడు అస్తమించడం మిథున రాశి వారికి ఇబ్బందులు సృష్టిస్తుంది. వ్యాపారస్థులకు, ఉద్యోగార్థులకి ఇది గడ్డు కాలంగా మారుతుంది. ఆర్థిక పరంగా నష్టపోతారు. ఉద్యోగం మారాలని అనుకుంటే ఈ సమయం కరెక్ట్ కాదు. ఆఫర్లు కూడా లభించకపోవచ్చు.