Mithuna Rasi 2024: మిథున రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు.. ఖర్చులు అధికం-mithuna rasi 2024 rasi phalalu check your gemini astrological prediction for the new year ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mithuna Rasi 2024: మిథున రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు.. ఖర్చులు అధికం

Mithuna Rasi 2024: మిథున రాశి కొత్త సంవత్సర రాశి ఫలాలు.. ఖర్చులు అధికం

HT Telugu Desk HT Telugu
Dec 13, 2023 10:05 AM IST

Mithuna Rasi 2024: మిథున రాశి జాతకులు 2024వ సంవత్సరంలో ఖర్చులు నియంత్రించుకోవలసిన సమయం అని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. మిథున రాశి 2024 సంవత్సర రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Mithuna Rasi 2024: మిథున రాశి 2024 రాశి ఫలాలు
Mithuna Rasi 2024: మిథున రాశి 2024 రాశి ఫలాలు (Pixabay)

2024వ సంవత్సరం మిథున రాశి వారికి ఖర్చులు అధికముగా ఉండేటటువంటి సంవత్సరమని, మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

2024వ సంవత్సరంలో భాగ్య స్థానములో శని 'ప్రభావంచేత కుటుంబములో ఏదో ఒక సమస్య వేధించును. ఉద్యోగ వ్యాపారాలలో భయాందోళనలు కలుగును. 2024లో మొదటి 4 నెలలు గురుడు లాభస్థానములో ఉండటం చేత అనుకూల మరియు శుభ ఫలితములు కలుగును.

2024 ద్వితీయార్థములో ముఖ్యముగా మే నుండి డిశంబర్‌ వరకు బృహస్పతి వ్యయస్థానములో సంచరించుట చేత మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెట్టును. మిథునరాశి వారికి అప్పుల బాధలు, ఖర్చులు ఇబ్బంది పెట్టు సూచనలు అధికముగా ఉన్నాయి.

మిథున రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు కలిగే అవకాశాలు అధికముగా ఉన్నాయి. మిథునరాశి వ్యాసారస్తులకు వ్యాపారం కోసం అప్పులు చేయడం, ఖర్చులు అధికమవ్వడం గోచరిస్తుంది.

రైతాంగం మరియు సినీరంగాల వారికి ఈ సంవత్సరం మధ్యస్థముగా ఉన్నది. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మిథున రాశి విద్యార్థులకు 2024 సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రాజకీయనాయకులకు 2024 సంవత్సరం ప్రతికూల ఫలితాలు కలుగును.

మిథున రాశి 2024 ప్రేమ జీవితం

2024 సంవత్సరంలో మిథునరాశి వారికి ప్రేమ జీవితం అనుకూలించును. ప్రేమ వ్యవహారాలలో కొన్ని భేదాభిప్రాయములు కలిగినప్పటికి కలసికట్టుగా ముందుకు సాగెదరు. ప్రేమ వ్యవహారాలలో 2024 మిథునరాశి వారికి అనుకూల మరియు సత్‌ ఫలితాలు కలుగును. సౌఖ్యము మరియు అనందము పొందెదరు.

మిథున రాశి 2024 ఆర్థిక విషయాలు

2024 సంవత్సనం మిథునరాశి వారికి ఆర్థిక పరముగా అంత అనుకూలంగా లేదు. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో మిథునరాశికి కలసివచ్చినప్పటికి 2024 మే నుండి వ్యయస్థానములో గురుని ప్రభావం వలన ఆర్థిక పరమైనటువంటి సమస్యలు గోచరించుచున్నవి.

అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. ఆర్థిక సమస్యలు, బాధలు ఇబ్బంది పెట్టును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును. అప్పుల బాధలు అధికమగు సూచన. ఆర్థికపరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి.

మిథున రాశి 2024 కెరీర్

మిథున రాశి వారికి 2024 సంవత్సరం కెరీర్ పరంగా కొంత ఆటుపోట్లు అధికముగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు ఏర్పడును. నిరుద్యోగులకు ఉద్యోగము రావడంలో ఇబ్బందులు కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు ఇబ్బంది కలిగించును. కెరీర్ విషయంలో లాభపడటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించటం మంచిది.

మిథున రాశి 2024 ఆరోగ్యం

2024 సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి సంవత్సరం. గత కొంతకాలముగా ఎదురైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడదెదరు. ఆరోగ్యపరంగా మిథునరాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూల మరియు సత్‌ ఫలితాలు కలిగించును.

మిథున రాశి 2024 పరిహారాలు

మిథున రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి. బుధవారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం, విష్ణు సహస్ర నామం వంటివి పారాయణ చేయాలి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి, పూజించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner