తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, విజయం కలగాలంటే ఏం చేయాలి? ఈ రోజు చేయకూడని 10 పనులు

Saphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, విజయం కలగాలంటే ఏం చేయాలి? ఈ రోజు చేయకూడని 10 పనులు

Peddinti Sravya HT Telugu

21 December 2024, 10:00 IST

google News
    • Saphala Ekadashi: హిందూమతంలో ప్రతి నెలా వచ్చే శుక్లపక్షం, కృష్ణపక్షం ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ రోజు విష్ణుమూర్తి ఆరాధనకు అంకితం చేయబడింది. మత విశ్వాసాల ప్రకారం, ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు లభిస్తుంది. ఈ రోజు మాత్రం కొన్ని పొరపాట్లు చేయకూడదు.
Saphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, విజయం కలగాలంటే ఏం చేయాలి?
Saphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, విజయం కలగాలంటే ఏం చేయాలి?

Saphala Ekadashi: సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది, విజయం కలగాలంటే ఏం చేయాలి?

సఫల ఏకాదశి చాలా ప్రత్యేకమైంది. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. ఈ ప్రత్యేకమైన రోజు విష్ణువును ఆరాదిస్తే మంచిది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. మరి వాటి గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

2025 జనవరిలో మాళవ్య రాజయోగంతో వీరికి ధన యోగం, ఊహించని ప్రయోజనాలు!

Dec 19, 2024, 06:09 AM

హిందూమతంలో ప్రతి నెలా వచ్చే శుక్లపక్షం, కృష్ణపక్షం ఏకాదశి రోజున ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ రోజు విష్ణుమూర్తి ఆరాధనకు అంకితం చేయబడింది. మత విశ్వాసాల ప్రకారం, ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు లభిస్తుంది. అయితే ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు చేయకూడదు.

అలా చేస్తే నష్టం వస్తుందని గుర్తు పెట్టుకోండి. ద్రుక్ పంచాంగం ప్రకారం సఫల ఏకాదశి డిసెంబర్ 26న వచించింది. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. సఫల ఏకాదశి ఉపవాసం ఒక వ్యక్తికి తెలిసో తెలియకో చేసిన పాపాల నుండి విముక్తి కలిగిస్తుందని, విజయానికి మార్గం తెరుస్తుందని నమ్ముతారు, కానీ ఈ ఏకాదశి రోజున కొన్ని పనులు నిషిద్ధం. మరి సఫల ఏకాదశి రోజున ఏం చేయకూడదో ఇప్పుడే తెలుసుకుందాం.

సఫల ఏకాదశి రోజున చేయకూడని 10 పనులు ఇవే:

1.సఫల ఏకాదశి రోజున ఉల్లి-వెల్లుల్లితో సహా అన్ని తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి.

2. ఏకాదశి రోజున తులసి ఆకును తెంపకూడదు. విష్ణువు ఆరాధనకు ఒక రోజు ముందు తులసి ఆకును తీసి ఇంట్లో పెట్టుకోండి.

3. ఈ రోజున ఉపవాస దీక్ష చేయాలి. అసభ్య పదజాలం వాడకుండా ఉండాలి.

4. సఫల ఏకాదశి నాడు ఎలాంటి వాదోపవాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి.

5. ఈ రోజున ఉపవాసం ఉంటే కోపానికి దూరంగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు.

6. ఏకాదశి ఉపవాసం సమయంలో ఏ రూపంలోనైనా బియ్యం తినడం నిషిద్ధం.

7. ఏకాదశి ఉపవాసం సమయంలో మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి.

8. ఈ రోజున ఉపవాసం చేసేవారు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి.

9. ఏకాదశి రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం మానుకోండి.

10. ఏకాదశి ఉపవాసం సమయంలో ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రోజున ఇల్లు, పూజ గది మురికిగా ఉండకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం