Kamada ekadashi: కామద ఏకాదశి రోజు ఈ రాశుల వారికి విష్ణుమూర్తి అనుగ్రహం.. అనుకున్నవన్నీ జరుగుతాయి
Kamada ekadashi lucky zodiac signs: చైత్ర మాసంలో వచ్చిన మొదటి ఏకాదశిని కామద ఏకాదశి అని అంటారు. ఏప్రిల్ 19వ తేదీ కామద ఏకాదశి జరుపుకుంటారు. ఈరోజు కొన్ని రాశుల వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో అనుకున్నవన్నీ జరుగుతాయి.
Kamada ekadashi lucky zodiac signs: ఏప్రిల్ 19వ తేదీ కామద ఏకాదశి జరుపుకోనున్నారు. హిందూ నూతన సంవత్సరం మొదలైన తర్వాత వచ్చిన మొదటి ఏకాదశి ఇది. ఏకాదశి రోజు విష్ణుమూర్తికి పూజ చేసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
కామద ఏకాదశి రోజు విష్ణు లక్ష్మీ సమేతంగా పూజ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వాసం. ఈ కామద ఏకాదశి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. విష్ణు అనుగ్రహంతో ఈ రాశుల వారికి అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏయే రాశుల వారికి కామద ఏకాదశి అదృష్టాన్ని ఇస్తుందో చూద్దాం.
మేష రాశి
కామద ఏకాదశి రోజు మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. గ్రహాల సంచారం కూడా మేష రాశి వారికి అనుకూలంగా ఉంది. అందువల్ల మీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు కామద ఏకాదశి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. గ్రహాల అనుకూల సంచారంతో అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత, ఆధ్యాత్మిక అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి ఇదే అనుకూలమైన సమయం.
మిథున రాశి
కామద ఏకాదశి రోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. గ్రహాల అననుకూల స్థానాల వల్ల మీకు వృత్తిలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడతాయి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఊహించని వైపు నుంచి డబ్బు అందుతుంది. గ్రహాల అమరిక అనుకూలంగా ఉన్నాయి. వ్యక్తిగత అభివృద్ధి, ఆధ్యాత్మికం వైపు దృష్టి పెట్టడానికి ఇదే మంచి సమయం.
సింహ రాశి
ఈ సమయం విష్ణు అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కోరికలన్నీ తీరతాయి. గ్రహాల స్థానాలు సింహ రాశి వ్యక్తులకు విజయం, శ్రేయస్సు ని అందిస్తాయి. తమ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయగలుగుతారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి కామద ఏకాదశి సవాలుగా మారుతుంది. అనుకొని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృద్ధిలో ఆటంకాలు ఉంటాయి. ఓపికగా ఉండాలి.
తులా రాశి
కామద ఏకాదశి ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకునేందుకు సదావకాశాన్ని ఇస్తుంది. గ్రహాలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి.
వృశ్చిక రాశి
ఈ ఏకాదశి వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. గ్రహాల అనుకూల పరిస్థితుల వల్ల విజయం, శ్రేయస్సు లభిస్తుంది.
ధనుస్సు రాశి
జీవితంలో గణనీయమైన మార్పులను చూస్తారు. వ్యక్తిగత అభివృద్ధికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకాలు కలుగుతాయి. ఎన్ని సవాళ్లు వచ్చినా వాటిని దాటుకునేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయం సవాలుతో కూడుకున్నటువంటిది. అడ్డంకులు ఎదురవుతాయి. కొన్ని సవాళ్లు మీ విజయానికి వృద్ధికి అడ్డుగోడగా నిలుస్తాయి. దృఢ నిశ్చయంతో ఉండాలి.
కుంభ రాశి
గ్రహాల స్థానాలు కుంభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా వారి లక్ష్యాలు నెరవేర్చుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయంలో ఉంటుంది.
మీన రాశి
కామద ఏకాదశి మీరు దైవికంగా బలపడేందుకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెడతారు.