Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి రోజు ఈ పని చేశారంటే చాలు.. అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు ఉండవు
18 May 2024, 17:00 IST
- Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు ఉండవు. మీకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది.
మోహినీ ఏకాదశి పరిహారాలు
Mohini ekadashi 2024: అన్నీ ఏకాదశులలో మోహినీ ఏకాదశి చాలా పవిత్రమైన, ఫలమంతమైన తిథిగా భావిస్తారు. పురాణ విశ్వాసాలు ప్రకారం ఈ పవిత్రమైన రోజున ఎవరైతే సంపూర్ణ నియమాలతో ఉపవాసం ఉంటారో వారి జీవితంలో అంతా మంచే జరుగుతుంది. మోహినీ ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించిన వ్యక్తి ప్రాపంచిక కోరికల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు కూడా నశిస్తాయని విశ్వసిస్తారు.
లేటెస్ట్ ఫోటోలు
మే 19వ తేదీ మోహినీ ఏకాదశి వచ్చింది. క్షీరసాగర మథనం సమయంలో రాక్షసుల నుండి అమృతాన్ని రక్షించడం కోసం మహా విష్ణువు మోహినీ రూపాన్ని ధరించాడు. దేవతలందరికీ అమృతం అందేలా చేశాడు. అందుకే ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పురాణాల ప్రకారం మోహినీ రూపంలో ఉన్న విష్ణువుని ఈరోజు పూజిస్తారు. ఈ ఏకాదశి నాడు మహా విష్ణువు ఆశీర్వాదం కోసం కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీకు శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది.
ఇంటి సానుకూలత కోసం
తులసి లేకుండా విష్ణు పూజ అసంపూర్ణం. అందుకే మోహినీ ఏకాదశి నాడు తులసి మొక్కను పూజించాలి. దేశీ నెయ్యితో దీపం వెలిగించి తులసి దేవికి హారతి ఇవ్వాలి. దీపం వెలిగించిన తర్వాత ఓం నమో వాసుదేవాయ నమః అని జపించాలి. తులసి మొక్కకు 11 లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ భావన బలపడుతుంది.
సంపద కోసం
దక్షిణామూర్తి శంఖాన్ని పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. భక్తులకు అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు డబ్బు కొరత ఎదుర్కోరు. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. శంఖం ద్వారా విష్ణువు, శ్రీకృష్ణుడికి పంచామృతంతో అభిషేకం చేయాలి. అలాగే తులసి పత్రాన్ని విష్ణువుకి తప్పనిసరిగా సమర్పించాలి. ఏకాదశి రోజు బంతి పువ్వు మొక్క నాటడం శుభప్రదంగా పరిగణిస్తారు. గరిష్ట ప్రయోజనాలు పొందడం కోసం మీరు ఈ మొక్కను ఇంటి ఉత్తర దిశలో నాటవచ్చు.
అప్పుల నుంచి బయటపడేందుకు
మీరు ఏదైనా రుణాలు తీసుకొని బాధపడుతున్నట్లయితే వాటిని తీర్చడం కోసం ఇబ్బంది పడుతుంటే మోహిని ఏకాదశి రోజు ఈ పరిహారం పాటించండి. రాగి పాత్రలో కొద్దిగా నీరు తీసుకొని అందులో పంచదార కలిపి రావి చెట్టుకు సమర్పించాలి. సాయంత్రం చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించాలి. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడని ప్రతీతి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి అన్ని రకాల అప్పుల నుండి బయటపడతాడు.
శుభ ఫలితాలు పొందేందుకు
ఈ ఏకాదశి పర్వదినాన రావి లేదా తులసిని పూజించాలి. అలాగే పాలలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తులసి మాలతో జపించాలి. జీవితం నుంచి అన్ని బాధలు తొలగించమని భగవంతుడిని హృదయపూర్వకంగా వేడుకోవాలి.
సుఖ సంతోషాలు పొందేందుకు
మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి శ్రీహరి విష్ణువుని ధర్మానుసారం పూజించాలి. రాత్రి విష్ణుమూర్తి విగ్రహం ముందు తొమ్మిది దీపాలు వెలిగించాలి. రాత్రంతా దీపం వెలిగేలా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల సంపదతో పాటు సుఖసంతోషాలు సమృద్ధిగా లభిస్తాయి.