తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  According To Astrology, During Those 73 Days, Some Zodiac Signs Will Have Good Job Luck.

Lucky Zodiacs : ఆ రాశులవారికి.. ఈ రెండు నెలలు లాభాలే లాభాలు..

02 November 2022, 12:36 IST

    • Lucky Zodiacs for Next 73 Days : మిథున రాశిలోకి కుజుడు సంచారిస్తున్నాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు. ఉద్యోగంలో మంచి అవకాశం, పరీక్షల్లో విజయం సాధిస్తారు అంటున్నారు. ఇంతకీ ఆ అదృష్టవంతులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 
ఆ రాశులవారికి అదృష్టమే అదృష్టం
ఆ రాశులవారికి అదృష్టమే అదృష్టం

ఆ రాశులవారికి అదృష్టమే అదృష్టం

Lucky Zodiacs for Next 73 Days : కుజుడుని ధైర్యం వంటి వాటికి కారక గ్రహంగా పరిగణిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు 73 రోజుల పాటు మిథునరాశిలో ఉంటాడు. దీని ఫలితంగా కొన్ని రాశులవారు ఉద్యోగాలు, డబ్బు పరంగా అధిక ప్రయోజనం పొందుతారు అంటున్నారు. పదిరోజుల క్రితం కుజుడు వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశించాడు.

లేటెస్ట్ ఫోటోలు

మే 2, రేపటి రాశి ఫలాలు.. రేపు రాజకీయ నాయకులకు కష్టసమయం, శత్రువులను గుర్తించండి

May 01, 2024, 08:31 PM

Shukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే, కోరికలు నెరవేరతాయి

May 01, 2024, 02:35 PM

మే 1, రేపటి రాశి ఫలాలు.. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి, ఎవరినీ చూసి మోసపోవద్దు

Apr 30, 2024, 09:06 PM

Gajakesari Raja Yoga : గజకేసరి రాజ యోగం.. వీరికి అన్ని విధాలుగా సూపర్

Apr 30, 2024, 02:10 PM

Gajakesari yogam: మే నెలలో అదృష్టాన్ని పొందబోతున్న రాశులు ఇవే.. ఆదాయం రెట్టింపు

Apr 30, 2024, 02:04 PM

అదృష్టం అంతా ఈ రాశి వారిదే! డబ్బు, ప్రమోషన్​.. అని సమస్యలు దూరం

Apr 30, 2024, 06:14 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుజుడు 73 రోజుల పాటు తిరోగమనంలో ఉంటాడు. జ్యోతిషశాస్త్రంలో ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనివల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు. మరి ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో.. ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభం

వృషభ రాశి వారు కుజుడు సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు. ఇది వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అప్పులు తీర్చేస్తారు. వ్యాపారం కారణంగా ఎక్కడికైనా వెళ్లడం లాభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభపడతారు. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి విజయం లభిస్తుంది.

సింహం

కుజుడు 11వ పాదంలో సింహరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఇది ఆదాయ వృద్ధి ప్రదేశంగా చెప్తారు. కుజుడు తిరోగమనం సింహ రాశి వారికి వృత్తి, వ్యాపారంలో విజయాన్ని ఇస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. లాభం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో కూడా డబ్బు సంపాదించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

కుంభం

కుంభ రాశి స్థానికులు కుజుడి తిరోగమనం వల్ల ప్రయోజనం పొందుతారు. కుంభరాశి ఐదవ ఇంట్లో కుజుడు తిరోగమనంలో ఉన్నాడు. ఇది విద్యా ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో బాగా సెటిల్ అవుతారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

టాపిక్