తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiacs For Lunar Eclipse : ఆ రాశుల వారికి చంద్రగ్రహణంతో ఆర్థికంగా కలిసి వస్తుంది..

Lucky Zodiacs for Lunar Eclipse : ఆ రాశుల వారికి చంద్రగ్రహణంతో ఆర్థికంగా కలిసి వస్తుంది..

28 October 2022, 21:34 IST

google News
    • Lucky Zodiacs for Lunar Eclipse : నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం.. ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి మంచిగా ఉంటుందని.. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఏ రాశులవారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
చంద్రగ్రహణం 2022
చంద్రగ్రహణం 2022

చంద్రగ్రహణం 2022

Lucky Zodiacs for Lunar Eclipse : సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం నవంబర్ 8, 2022న జరుగుతుంది. అక్టోబరు 25న సూర్యగ్రహణం వచ్చింది. మరో 15 రోజుల్లో గ్యాప్​లోనే రెండో గ్రహణం వచ్చేస్తుంది. అయితే జ్యోతిష్కుల ప్రకారం.. ఒక వైపు లేదా 15 రోజులలో రెండు గ్రహణాలు ప్రధాన అశుభ సంకేతాలుగా పరిగణిస్తారు. మహాభారత యుగంలో కూడా ఒకే దశలో రెండు గ్రహణాలు ఉండేవని చెబుతారు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల చాలామందిలో భయాలు ఉంటాయి. అయితే ఈ సమయంలో కూడా 4 రాశుల వారు సంతోషంగా ఉంటారని చెప్తున్నారు జ్యోతిష్యులు. మరి ఏ రాశివారికి మంచిదో.. ఆర్థికంగా ఎవరికి కలిసి వస్తుందో ఇప్పుడు చుద్దాం.

మిథునరాశి

ఈ రాశి వారికి చంద్రగ్రహణం సమయం మంచిది. వారి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించవచ్చు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. చదువుకునే వారికి కూడా ఇది చాలా మంచిది.

కర్కాటకం

ఈ రాశి వారికి చంద్రగ్రహణం కూడా మంచిది. ఈ సమయం నుంచి వారి పని మెరుగుపడుతుంది. వ్యాపారం లేదా ఉద్యోగం - రెండు రంగాలలో మెరుగుదలకు అవకాశాలు పెరుగుతాయి. అయితే ఆ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అప్పుడు వృత్తిపరమైన మెరుగుదల ఉంటుంది.

వృశ్చికం

ఈ రాశివారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశముంది. ఈ సమయంలో తెలివిగా ఖర్చు చేస్తే.. చాలా మంచిది.

కుంభం

ఈ రాశి వారికి డబ్బు సమకూరుతుంది. వారు కుటుంబ వనరుల నుంచి డబ్బు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పని ఒత్తిడి తగ్గుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం