తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lunar Eclipse 2022 Unlucky Zodiacs : ఆ రాశులవారు చంద్రగ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండండి..

Lunar Eclipse 2022 Unlucky Zodiacs : ఆ రాశులవారు చంద్రగ్రహణం తర్వాత జాగ్రత్తగా ఉండండి..

01 November 2022, 15:24 IST

google News
    • Chandra Grahan 2022 Unlucky Zodiacs : చంద్రగ్రహణం తర్వాత.. 200 సంవత్సరాల తర్వాత రెండు అశుభ యోగాలు ఏర్పడుతున్నాయి అంటున్నారు జ్యోతిష్యులు. దీనివల్ల పలు రాశులవారిని అశుభ ఫలితాలు వెంటాడుతాయని చెప్తున్నారు. మరి ఏ రాశులవారికి గ్రహణం ఎఫెక్ట్ ఉంటుందో తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. 
చంద్ర గ్రహణం 2022
చంద్ర గ్రహణం 2022

చంద్ర గ్రహణం 2022

Chandra Grahan 2022 Unlucky Zodiacs : నవంబర్ 8 (మంగళవారం)న చంద్రగ్రహణం జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 200 సంవత్సరాల తర్వాత ఆ రోజున రెండు దుష్ట యోగాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా కొన్ని రాశివారిపై దుష్ప్రభావాలుంటాయి. అంగారక గ్రహానికి దగ్గరగా ఉన్నందుకు షష్టక యోగం, నీచరాజ్ భంగ యోగం ఆ దుష్ట యోగాన్ని సృష్టిస్తున్నాయి. మేషరాశిలో గ్రహణం ఉండబోతోందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అయితే పలు రాశులవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి ఏ రాశులవారికి.. ఎలాంటి సమస్యలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం

చంద్రగ్రహణం మేషరాశి స్థానికులకు అశుభకరంగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశిలో చంద్రగ్రహణం జరగబోతోంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మరొకరితో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఏ పెట్టుబడి అయినా జాగ్రత్తగా చేయాలి. భాగస్వామ్యాలు దెబ్బతినవచ్చు. కాబట్టి మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి

చంద్రగ్రహణం తులారాశి వారికి కూడా కష్టంగానే ఉంటుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఒక విషయంలో జీవిత భాగస్వామితో గందరగోళం ఏర్పడవచ్చు. తుల రాశి వారికి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఏ పనిలోనైనా జాగ్రత్త అవసరం.

ధనుస్సు

చంద్రగ్రహణం ధనుస్సు రాశి వారి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. వ్యక్తిగత విషయాల గురించి ఆందోళన చెందకండి. పనికి సంబంధించిన ఏదో మానసిక ఆలోచనలు ఉంటాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందంలో మీరు చిక్కుకుపోవచ్చు. శని అర్ధ-సతి ధనుస్సు స్థానికులను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం