సెప్టెంబర్ 10, నేటి రాశి ఫలాలు- మీ విషయాలు మూడో వ్యక్తికి చెప్పొద్దు, మీకే నష్టం
10 September 2024, 0:01 IST
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 10.09.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
సెప్టెంబర్ 10 నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 10.09.2024
లేటెస్ట్ ఫోటోలు
వారం: మంగళవారం, తిథి: సప్తమి,
నక్షత్రం: అనురాధ, మాసం: భాద్రప్రద,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
ఆచితూచి అడుగేయాల్సిన సమయం ఇది. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. చీటికిమాటికి చికాకు పడతారు. ఖర్చులు విపరీతం. పాతమిత్రుల కలయిక అనుభూతినిస్తుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. అమ్మవారి దర్శనం శుభఫలితాలు అందిస్తుంది.
వృషభం
మీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా అడుగు లేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. ఆప్తులకు మీ సమస్యలు తెలియ జేయండి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పిల్లల కదలికపై దృష్టి సారించండి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మిథునం
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది.
కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ప్రముఖుల సలహా పాటిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. కీలక పనులు ముందుకు సాగవు. అపరిచితులతో మితంగా సంభాషించండి. లక్ష్మీదేవిని ఆరాధించండి.
సింహం
మునుపటి కంటే పరిస్థితులు చక్కబడతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనులు ఒక పట్టాన సాగవు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
కన్య
కీలక వ్యవహారాల్లో నిపుణుల సలహా పాటించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించు కుంటారు. పట్టుదలతో శ్రమిస్తే గాని పనులు కావు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి.
తుల
సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. రావలసిన ధనాన్ని సౌమ్యంగా రాబట్టుకోవాలి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారిపోతాయి. అపజయాలకు కుంగిపోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. సోదరులతో విభేదిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
వృశ్చికం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి.
ధనుస్సు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మాట తీరు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనదారులకు దూకుడు తగదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
మకరం
సర్వత్రా అనుకూలమే. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృథా కాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. సాయం ఆశించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
కుంభం
లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఇతరుల సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అవకాశాలను వదులుకోవద్దు. పట్టుదలతో శ్రమిస్తే గాని పనులు కావు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గిట్టని వ్యక్తులు మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు.
మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు లేకున్నా సంతృప్తి ఉండదు. ఆలోచనలతో సతమతమ వుతారు. మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. సన్నిహితులు హితవు మీపై పనిచేస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవు తాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు.