Mars nakshtra transit: కుజుడి సంచారంతో వ్యాపారస్తులకు ధనం, ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది-mars nakshtra transit from august 16 will turn the luck for these 4 zodiac signs for 22 days ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Nakshtra Transit: కుజుడి సంచారంతో వ్యాపారస్తులకు ధనం, ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది

Mars nakshtra transit: కుజుడి సంచారంతో వ్యాపారస్తులకు ధనం, ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది

Gunti Soundarya HT Telugu
Aug 16, 2024 12:22 PM IST

Mars nakshtra transit: కుజుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని వల్ల కుజుడి సంచారంతో వ్యాపారస్తులకు ధనం, ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. సెప్టెంబర్ 5 వరకు ఈ రాశుల వారికి అదృష్టం అండగా నిలుస్తుంది. అవి ఏ రాశులో చూద్దాం.

మృగశిర నక్షత్రంలోకి కుజుడు
మృగశిర నక్షత్రంలోకి కుజుడు

Mars nakshtra transit: జ్యోతిషశాస్త్రంలో భూమి, ధైర్యానికి కారకంగా అంగారకుడిని పరిగణిస్తారు. జాతకంలో కుజుడి శుభ స్థానం వ్యక్తి విధిని మార్చడంలో సహాయపడుతుంది. అంగారకుడి ఆశీర్వాదం కారణంగా వ్యక్తి వృత్తిలో విజయాన్ని పొందుతారు. ఆర్థిక లాభం కూడా పొందుతారు. ప్రస్తుతం కుజుడు వృషభరాశిలో ఉన్నాడు. శ్రావణ పుత్రద ఏకాదశి రోజు కుజుడు నక్షత్రాన్ని మార్చడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మెరుగుపరుస్తాడు.

అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు ఆగస్ట్ 16, 2024 శుక్రవారం తన నక్షత్రాన్ని మారుస్తాడు. ఇక ఇదే నెలలో రాశిని కూడా మారుస్తాడు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు కూడా ఈ రోజునే  సంచరిస్తాడు. సూర్యుడు తన సొంత రాశి సింహ రాశిలో నేటి నుంచి సంచరిస్తున్నాడు. అంగారక రాశిలో మార్పు వల్ల ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి.

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, 2024 ఆగస్ట్ 16న కుజుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 5 వరకు కుజుడు ఈ రాశిలో ఉంటాడు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 6న కుజుడు ఆర్ద్ర నక్షత్రంలో సంచరిస్తాడు. కుజుడి నక్షత్ర మార్పు వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 

కుంభ రాశి 

కుంభ రాశి వారు కుజుడు నక్షత్ర మార్పు వల్ల ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఈ కాలంలో మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు. సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో పురోగతి సంకేతాలు ఉన్నాయి.

వృషభ రాశి 

మృగశిర నక్షత్రంలో కుజుడి సంచారం వృషభ రాశి వారికి శుభప్రదం కానుంది. అది మాత్రమే కాకుండా ప్రస్తుతం కుజుడు ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. అందువల్ల వీరికి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. కుజుడు నక్షత్ర మార్పు ప్రభావం కారణంగా మీరు మీ ఉద్యోగంలో పురోగతిని పొందుతారు. అదృష్టం మీ వైపు ఉంటుంది. మీరు శ్రమకు పూర్తి ప్రయోజనం పొందుతారు. మీరు ఆర్థికంగా మంచి పనితీరు కనబరుస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

మిథున రాశి 

మృగశిర నక్షత్రంలో అంగారకుడి సంచారం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంగారకుడి ఆశీర్వాదంతో అదృష్టం ప్రతి పనిలో మీకు మద్దతు ఇస్తుంది. మీరు పెట్టుబడిపై మంచి రాబడిని పొందుతారు. వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంటుంది. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి.

వృశ్చిక రాశి 

కుజుడు నక్షత్ర మార్పు వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీరు ఉద్యోగంలో పెద్ద బాధ్యతను తీసుకోవచ్చు లేదా కొత్త ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించవచ్చు. కొత్త వనరుల నుండి ధనం వస్తుంది. వ్యాపారస్తులకు మంచి డబ్బు అందుతుంది. ఈ కాలంలో మీ కలలు కొన్ని నెరవేరవచ్చు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.