Palmistry: అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా? జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది-does scratching the palm really bring money what does astrology say ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Palmistry: అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా? జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది

Palmistry: అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా? జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది

Gunti Soundarya HT Telugu
Aug 12, 2024 09:22 AM IST

Palmistry: అరచేతిలో దురద పెడితే భారీగా ఆర్థిక లాభాలు ఉంటాయని, అదృష్టం అండగా నిలుస్తుందని కొందరు నమ్ముతారు. అందులో నిజమెంత? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకోండి.

అరచేతిలో దురద పెడితే అదృష్టమా?
అరచేతిలో దురద పెడితే అదృష్టమా?

Palmistry: అరచేతిలో దురద పెడితే డబ్బులు చేతికి అందుతాయని చాలా మంది నోటి వెంట వింటూనే ఉంటారు. మరికొందరు ఏమో డబ్బులు నష్టపోతారని అంటారు. ఇక అరికాలు దురద పెడితే ఏదో ప్రయాణం చేయబోతున్నారని, ఇంటికి చుట్టాలు వస్తున్నారని ఏవేవో చెప్తూ ఉంటారు. ఇవన్నీ నిజంగా జరుగుతాయా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోందో చూద్దాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సాముద్రిక హస్త శాస్త్రం ప్రకారం అరచేతులు దురద పెడితే డబ్బులు లభిస్తాయట. అయితే పురుషులు, స్త్రీలు ఒక్కొకరికి భిన్నమైన ఫలితాలు కలుగుతాయి. అవి ఎలా ఉంటాయి. పురుషులు, స్త్రీలకు అరచేతులు దురద పెడితే ఏంటి అర్థం అనేది తెలుసుకుందాం.

పురుషులకు కుడి అరచెయ్యి దురద పెడితే

పురుషులకు కుడి అరచెయ్యి దురద పెడితే అది శుభవార్తే. త్వరలో వీరికి చేతికి డబ్బు అందబోతుంది అనే దానికి సంకేతం. ఇది మనసుకు చాలా సంతృప్తిని ఇస్తుంది. డబ్బు ప్రవేశాన్ని సూచిస్తుంది. అలాగే ఊహించని అదృష్టాన్ని ఇవ్వబోతుందని అర్థం. ఊహించని ప్రదేశాల నుంచి డబ్బు రావడం వల్ల ఆనందంగా ఉంటారు అనే దానికి ఇది ఒక సంకేతం. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందబోతుంది.

ఎడమ అరచేతి దురద

అదే ఎడమ అరచెయ్యి దురద పెట్టింది అనుకో మీ డబ్బు చేతి నుంచి జారిపోతుందని అర్థం. ఆర్థికంగా నష్టపోయే సూచనను ఇది తెలియజేస్తుంది. దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఊహించని విధంగా ఖర్చులు రావడం వల్ల డబ్బు కోల్పోతారు. అప్పుల పాలు అయ్యే అవకాశం కూడా ఉంటుందట. పురుషులకు ఎడమ అరచెయ్యి దురద పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని చెప్పేందుకు ఇదొక సంకేతం.

మహిళలకు కుడి అరచెయ్యి దురద పెడితే

పురుషులకు మాదిరిగానే స్త్రీలకు కూడా కుడి అరచెయ్యి దురద పెడితే అదృష్టమే. ఆర్థికంగా భారీగా లాభపడబోతున్నారని దీని అర్థం. అధిక సంపద కలుగుతుంది. అన్ని వైపుల నుంచి డబ్బు చేతికి అందుతుంది. శ్రేయస్సు, విజయం లభిస్తుంది అనే దానికి ఇదొక సంకేతంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభించబోతున్నాయని చెప్పకనే చెప్పినట్టు అవుతుందట.

కుడి చేతిలో దురద పెడితే

స్త్రీలకు కుడి అరచేతిలో దురద పెడితే అపశకునంగానే భావిస్తారు. మీ అదృష్టం చేజారిపోతుంది అనే దానికి ఇదొక సంకేతంగా జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అలాగే దురద పెడుతుందని అదే పనిగా రుద్దడం మంచిది కాదట. ఇది డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడాన్ని సూచిస్తుంది. హస్త సాముద్రికం ప్రకారం స్త్రీలు తమ కుడి అరచేతిని అతిగా రుద్దితే డబ్బు ఇంట్లో అసలు నిలవదని అంటారు. అందుకే దురద పెడితే గోకకుండ వదిలేయడం ఉత్తమ. లేదంటే సంపాదించింది అంతా వృథాగా కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

శాస్త్రీయంగా వీటిని కొందరు కొట్టి పడేస్తారు. అరచేతులు దురద పెడితే అది అనారోగ్య సమస్య అని అంటారు. అందువల్ల వెంటనే డాక్టర్ ని సంప్రదించమని సలహా ఇస్తారు. మరికొందరు మాత్రం అదృష్టంగా భావిస్తారు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాపిక్