Mars transit: కుజుడి సంచారం.. ఈ రాశుల వారిని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, ఖర్చులు అధికమవుతాయి-mars transit from june 1st in mesha rasi these zodiac signs get health issues ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: కుజుడి సంచారం.. ఈ రాశుల వారిని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, ఖర్చులు అధికమవుతాయి

Mars transit: కుజుడి సంచారం.. ఈ రాశుల వారిని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, ఖర్చులు అధికమవుతాయి

Gunti Soundarya HT Telugu
Jun 08, 2024 10:05 AM IST

Mars transit: జూన్ 1 నుంచి కుజుడు మేష రాశిలో తన ప్రయాణం ప్రారంభించాడు. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి అననుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

కుజుడి సంచారంతో ఈ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు
కుజుడి సంచారంతో ఈ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు

Mars transit: జూన్ 1 నుంచి కుజుడు మేష రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం కొన్ని రాశి చక్రాల వారికి విభిన్న ప్రభావాలను ఇస్తుంది. మేష రాశి అంగారకుడి పాలక గ్రహం. దాన్ని సొంత రాశిలో కుజుడు ప్రవేశించినప్పుడు దాని బలం రెట్టింపు అవుతుంది. ధైర్యం, శౌర్యం, పరాక్రమం వంటి వాటికి కుజుడు ప్రతీకగా ఉంటాడు. 

మేష రాశిలో కుజుడి సంచారం కొందరికి మంచి శక్తిని ఇస్తుంది. కనుక ఈ రాశి వారికి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వ్యక్తులు ధైర్యంగా ఉంటారు. ఇతరులను రక్షించుకుంటారు .సవాళ్లకు భయపడరు. ఆకాంక్షలను నెరవేర్చుకుంటారు. స్వతంత్రంగా నివసించేందుకు ఆసక్తి చూపిస్తారు. 

కుజుడు తన సొంత రాశిలో కేంద్ర స్థానంలో ఉన్నందువల్ల ఈ సంచార సమయంలో అత్యంత శక్తివంతమైన రుచక రాజయోగం ఏర్పడుతుంది. కానీ కుజుడు మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కుజుడి అననుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు ధైర్యం సన్నగిల్లుతుంది. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు ఉంటాయి. చిన్న విషయాలకు కూడా నిగ్రహాన్ని కోల్పోతారు. ఇతరుల మీద ఆవేశ పడతారు. అంగారకుడి సంచారం ఎవరిని ఇబ్బంది పెడుతుందో తెలుసుకుందాం. 

వృషభ రాశి

కుజుడు వృషభ రాశి ఏడు, పన్నెండవ ఇంటికి అధిపతి. అయితే ప్రస్తుత సంచారం వృషభ రాశి 12వ ఇంట్లో జరుగుతుంది. ఫలితంగా ఈ సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఈ సమయంలో కొన్ని కంటి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు .ఇది మాత్రమే కాకుండా పంటి నొప్పిని అనుభవించవచ్చు. అందుకే ఎంతటి చిన్న అనారోగ్య సమస్య అయినా తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి.

కన్యా రాశి

అంగారకుడు కన్యా రాశి మూడు, ఎనిమిదో గృహాలకు అధిపతి. అంగారకుడు ఇప్పుడు ఎనిమిదో ఇంటి గుండా ప్రయాణిస్తున్నాడు. ఈ సంచారంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.  కళ్ళను రక్షించుకోవడం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా బాధించే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కంటికి సంబంధించిన సమస్యలు ఎప్పుడూ విస్మరించకూడదు. 

తులా రాశి

శుక్రుడు తులా రాశిని పాలించే గ్రహం. అయితే కుజుడు తులారాశి రెండు, ఏడో గృహాలకు అధిపతి. ఈ సమయంలో ఏడో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది ఆరోగ్యపరంగా సమస్యలు తీసుకొస్తుంది. ఈ సంచారం తులా రాశి వారికి తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను తీసుకొస్తుంది. వాటి నుంచి బయటపడేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

మకర రాశి

మకర రాశి నాలుగు, పదకొండు గృహాలకు అంగారకుడు అధిపతి .నాలుగో ఇంట్లో అంగారకుడి సంచారం జరుగుతోంది. ఫలితంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం ఉండదు. అందువల్ల ఒత్తిడి, నీరసం, అలసట వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కుటుంబంలోని తల్లి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. వారి చికిత్స కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. 

 

 

Whats_app_banner