Angaraka yogam: కుజుడి సంచారంతో అంగారక యోగం.. 40 రోజుల పాటు ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి-mars transit will form angarak yogam in meena rashi these zodiac signs get trobles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Angaraka Yogam: కుజుడి సంచారంతో అంగారక యోగం.. 40 రోజుల పాటు ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి

Angaraka yogam: కుజుడి సంచారంతో అంగారక యోగం.. 40 రోజుల పాటు ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి

Gunti Soundarya HT Telugu
Apr 23, 2024 05:39 PM IST

Angaraka yogam: అంగారకుడు ఏప్రిల్ 23వ తేదీ మీన రాశిలోకి ప్రవేశించాడు. దీంతో అంగారక యోగం ఏర్పడింది. దీని వల్ల మూడు రాశుల జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుజుడి సంచారంతో అంగారక యోగం
కుజుడి సంచారంతో అంగారక యోగం

Angaraka yogam: జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ధైర్యం, శౌర్యం, శక్తికి కారకుడు అయిన కుజ గ్రహం ఏప్రిల్ 23వ తేదీ కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఇప్పటికే రాహువు, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి.

కుజుడు నీడ గ్రహాలైన రాహువు లేదా కేతువుతో కలిసినప్పుడు అంగారక యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం మీన రాశిలో కుజుడు, రాహువు కలసి అంగారక యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక యోగాన్ని అశుభంగా పరిగణిస్తారు.

కుజుడు నీడ గ్రహం రాహువుతో వస్తే జీవితంలో అనేక క్లిష్ట పరిస్థితులను కలిగిస్తుందని నమ్ముతారు. ఆర్థిక పరిస్థితిలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. ధన నష్టం జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యోగం ప్రభావంతో వ్యక్తి ఎప్పుడూ కోపంగా ఉంటాడు. చీటికి మాటికి ఇతరులతో కారణం లేకుండానే గొడవలు పెట్టుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందం కొరవడుతుంది. దంపతుల మధ్య ప్రేమ సన్నగిల్లుతుంది. సోదరులు, స్నేహితులతో, బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలోను మోసపోతారు. ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి.

అంగారక యోగం కొన్ని రాశుల వారి జీవితాల్లో అలజడిని కలిగిస్తుంది. రాబోయే 40 రోజులపాటు ఈ మూడు రాశుల జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

మేష రాశి

అంగారక యోగం ప్రభావంతో మేష రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో భావోద్వేగాలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్యాలు ఆలస్యం అవుతాయి. ఆస్తి సంబంధిత వివాదాలు పెరుగుతాయి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. పనులన్నీ పూర్తి చేయలేకపోతారు.

కన్యా రాశి

అంగారక యోగం ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కోనున్న మరొక రాశి కన్యా రాశి. ఈ జాతకులు తమ సంబంధాల్లో చికాకులు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. లేదంటే డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మనసు ఆందోళన చెందుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. దూర ప్రయాణాలకు వెళ్లాలని ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి లేదంటే పోలీసు కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

అంగారక యోగం ప్రభావం ధనుస్సు రాశి జీవితంలో అలజడిని కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉంటారు. మానసిక అలజడి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి జీవితంలోనూ చికాకులు ఉంటాయి. స్త్రీలకు అత్తమామల వైపు నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. సంబంధాల్లో సహనం పాటించండి. కోపాన్ని నియంత్రించుకోవాలి. లేదంటే మీ మాటల ప్రభావంతో ఇతరుల మనసు గాయపడే అవకాశం ఉంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని సూచనలు ఉన్నాయి. అందుకే మాటలు అదుపులో ఉంచుకోవాలి.

Whats_app_banner