Mars transit: కుజుడి సంచారంతో అంగారక యోగం.. ఈ రాశుల వాళ్ళు కెరీర్ లో ఎదురుదెబ్బలు తింటారు-mars transit in aries conjunction with rahu create angaraka yogam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: కుజుడి సంచారంతో అంగారక యోగం.. ఈ రాశుల వాళ్ళు కెరీర్ లో ఎదురుదెబ్బలు తింటారు

Mars transit: కుజుడి సంచారంతో అంగారక యోగం.. ఈ రాశుల వాళ్ళు కెరీర్ లో ఎదురుదెబ్బలు తింటారు

Gunti Soundarya HT Telugu
Apr 05, 2024 03:59 PM IST

Mars transit: అంగారకుడు మరికొద్ది రోజుల్లో మీన రాశిలో సంచరించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి కెరీర్ లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో సమస్యలు, ఒత్తిడి ఉంటుంది.

కుజుడి సంచారంతో అంగారక యోగం
కుజుడి సంచారంతో అంగారక యోగం

Mars transit: ప్రస్తుతం శని కుంభ రాశిలో సంచరిస్తున్న కుజుడు మరికొద్ది రోజుల్లో తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. ఏప్రిల్ 23న అంగారకుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. శక్తి, ధైర్యం, కోపం వంటి వాటికి ప్రతీకగా ఉంటాడు.

కుజుడు మీన రాశిలో ఒక ప్రవేశించడం వల్ల ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. జ్యోతిషశాస్త్రంలో అంగారకుడు మండుతున్న గ్రహంగా పరిగణిస్తారు. ఇది శుభ స్థానంలో ఉంటే రాజభోగాలు అనుభవిస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. జ్ఞానం మెరుగుపడుతుంది. అనుకూలమైన ప్రభావాలు అందించినప్పుడు వృత్తిపరమైన విజయాలు, గౌరవం రెండింటిని పొందుతారు.

అంగారకుడు అశుభ స్థానంలో ఉంటే మాత్రం ఉద్యోగంలో విజయం సాధించడం కష్టంగా ఉంటుంది. మీన రాశిలో అంగారకుడు సంచరించడం వల్ల నిర్దిష్టమైన రాశుల వారికి వృత్తిపరమైన ఇబ్బందులు కలుగుతాయి. కుజుడు వచ్చే సమయానికి మీన రాశిలో ఇప్పటికే రాహువు సంచరిస్తున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక యోగం అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. కుజుడు నీడ గ్రహం రాహువుతో కలవడం వల్ల హింసాత్మక, ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి.

మేష రాశి

కుజుడు మేష రాశి పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంచారం వీరికి కలిసి రాదు. మేష రాశి వారు తమ వృత్తిపట్ల జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి మీపై పెరుగుతుంది. విజయానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు నిరాశ ఎదురవుతుంది. దీని ఫలితంగా ఆందోళన చెందుతారు. ఉద్యోగం కారణంగా మీకు ఇష్టం లేకపోయినా కొన్ని ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అనుకోకుండా ఉద్యోగాలు మారాల్సి వస్తుంది. అలాగే వేరే ప్రదేశానికి బదిలీ అవుతారు. అంగారక యోగం ప్రభావం వల్ల డబ్బు సమస్యలు ఎదుర్కొంటారు. పనులు ఆగిపోతాయి.

సింహ రాశి

అంగారకుడి ప్రభావం సింహ రాశి వారికి వృత్తి లక్ష్యాలను దెబ్బతీస్తుంది. పనిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులు అప్పగించిన పని చేయలేకపోతారు. ఒత్తిడి అనుభవిస్తారు. సహోద్యోగుల నుండి ఎటువంటి సహాయం పొందలేరు.

తులా రాశి

తులా రాశి జాతకులు ఈ సమయంలో వృత్తిపరంగా కష్టపడతారు. ఎంత కష్టపడినా కూడా ఉద్యోగ లక్ష్యాలను సాధించలేకపోతారు. బిజీగా ఉంటారు, పని కఠినంగా ఉంటుంది. అధికారులు మీ పని పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఈ సమయం నిరాశగా ఉంటుంది.

మకర రాశి

అంగారకుడి సంచార సమయంలో మకర రాశి వారికి చెడు ఫలితాలు ఎదురవుతాయి. సంతృప్తికరమైన జీవితం పొందలేకపోతారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోలేకపోతారు. కార్యాలయంలోని కొందరు వ్యక్తులు మీ ప్రయత్నాలను దెబ్బతీస్తారు. సహ ఉద్యోగుల ప్రవర్తన పట్ల ఆందోళనగా ఉంటారు.

వృశ్చిక రాశి

అంగారకుడి సంచారంతో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ లో ముందుకు సాగేందుకు చాలా కష్టపడతారు. విజయావకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. కెరిర్ గురించి ఆందోళన చెందుతారు.

WhatsApp channel