Mercury rise: ఉదయించబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి ధన నష్టం, ఆరోగ్య సమస్యలు
Mercury rise effect: గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో మీన రాశిలో ఉదయించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఇది అశుభ ఫలితాలు అందిస్తుంది. ధనం నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
Mercury rise effect: గ్రహాల రాకుమారుడు మరో మూడు రోజుల్లో రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాలలో బుధుడు ఒకడు. అత్యంత వేగంగా కదులుతుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న బుధుడు మహా శివరాత్రికి ముందే మార్చి 7న కుంభరాశిని వదిలి మీన రాశి ప్రవేశం చేయబోతున్నాడు.
బుధుడు రాబోతున్న మీన రాశిలో ఇప్పటికే రాహువు సంచరిస్తున్నాడు. దీంతో సుమారు 18 సంవత్సరాల తర్వాత బుధుడు, రాహువు కలయిక జరగబోతుంది. ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు మార్చి 14న ఉదయించబోతున్నాడు. వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు వ్యాపారం, తెలివితేటలు, కమ్యూనికేషన్స్ మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు.
మీన రాశిలో బుధుడు ఉదయించడం వల్ల 12 రాశుల రాశి చక్రాల మీద ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారి మీద ప్రతికూల ప్రభావాలు ఉండబోతున్నాయి. బుధుడు ఉదయించడం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండదు. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలంటే..
మేష రాశి
బుధుడు మేష రాశి మూడు, ఆరో ఇంటికి అధిపతిగా ఉంటాడు. 12వ ఇంట్లో ఉదయించబోతున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారికి ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. ఒక వ్యాధి వల్ల ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. చికిత్స కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో శత్రువులు మీ మీద విజయం సాధిస్తారు. కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం మారాలనుకుంటున్నట్లయితే ఈ సమయం సరైనది కాదు.
సింహ రాశి
సింహ రాశి రెండు, పదకొండవ ఇంటికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఎనిమిదో ఇంట్లో బుధుడు ఉదయించబోతున్నాడు. ఫలితంగా సింహ రాశి వారు ఈ కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తమామలతో గొడవలు జరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటుంటే ఈ సమయంలో నివారించడమే మంచిది లేదంటే నష్టాలకు దారితీస్తుంది. షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనువైన సమయం కాదు. కార్యాలయంలో మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కొన్ని అడ్డంకులు సృష్టిస్తారు. ఫలితంగా మీరు నిందలు పడాల్సి వస్తుంది.
తులా రాశి
బుధుడు తులా రాశి తొమ్మిది, పన్నెండవ ఇంటికి అధిపతిగా వ్యవహరిస్తాడు. ఆరో ఇంటిలో బుధుడు ఉదయించబోతున్నాడు. ఈ సమయంలో మీ శత్రువులు మీకు కొన్ని సమస్యలు కలిగిస్తారు. అందుకే వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరగడంతో ఒత్తిడికి గురవుతారు. తమ స్వలాభం కోసం మీ స్నేహితులు కూడా మీకు సమస్యలు కలిగించే అవకాశం ఉంది. విజయం సాధించాలంటే చాలా శ్రమించాల్సి వస్తుంది. పెరిగిన ఖర్చుల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండటమే మంచిది.
మీన రాశిలో మొదటి సంచారం వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ పరిహారాలు పాటించడం ఉత్తమం. బుధుడిని ప్రసన్నం చేసుకునేందుకు మీరు చిలుకలు, పావురాలు వంటి పక్షులకు ఆహారం అందించాలి. ప్రతిరోజు భోజనం చేసే ముందు రోజుకు ఒకసారైనా ఆవులకు ఆహారం ఇవ్వడం వల్ల బుధుడు సంతోషిస్తాడు. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు వంటి వాటిని దానం చేయాలి.