Sun rahu conjunction: 18ఏళ్ల తర్వాత సూర్యుడు రాహువు కలయిక.. ఈ రాశుల జాతకులు సవాళ్ళు ఎదురుకాబోతున్నాయ్-sun rahu conjunction in meena rashi after 18years these zodiac signs get facing problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Rahu Conjunction: 18ఏళ్ల తర్వాత సూర్యుడు రాహువు కలయిక.. ఈ రాశుల జాతకులు సవాళ్ళు ఎదురుకాబోతున్నాయ్

Sun rahu conjunction: 18ఏళ్ల తర్వాత సూర్యుడు రాహువు కలయిక.. ఈ రాశుల జాతకులు సవాళ్ళు ఎదురుకాబోతున్నాయ్

Gunti Soundarya HT Telugu
Mar 03, 2024 08:00 AM IST

Sun rahu conjunction: ఛాయా గ్రహం రాహువు, గ్రహాల రాజు సూర్యుడు కలయిక వల్ల కొన్ని రాశుల జాతకులు తమ జీవితంలో అనేక సవాళ్ళని ఎదుర్కోబోతున్నారు. ఏయే రాశుల వారికి ఈ సంయోగం అశుభ ఫలితాలు ఇస్తుందో చూద్దాం.

రాహువు సూర్యుడు కలయికతో ఇబ్బంది పడే రాశులు
రాహువు సూర్యుడు కలయికతో ఇబ్బంది పడే రాశులు

Sun rahu conjunction: వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి కీలక ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల రాజు సూర్యుడు త్వరలో రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. నెలకు ఒకసారి సూర్యుడు రాశి మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న సూర్యుడు మార్చి 14 న మీన రాశి ప్రవేశం చేస్తాడు. ఇప్పటికే అక్కడ పాప గ్రహంగా పరిగణించే రాహువు సంచరిస్తున్నాడు. ఎప్పుడూ వ్యతిరేక దిశలో సంచరిస్తూ ఏడాదిన్నరకు ఒకసారి రాహువు రాశి మారుస్తాడు.

సుమారు 18 సంవత్సరాల తర్వాత మీన రాశిలో రాహువు, సూర్యుడు కలయిక జరగబోతుంది. ఈ రెండు గ్రహాల కలయికని గ్రహణ యోగం అంటారు. ఇది సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. మీన రాశిలో సూర్యుడు, రాహువు సంయోగ సమయంలో కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. అనేక సమస్యలు ఎదుర్కోబోతున్నారు. ఏయే రాశుల మీద రాహు సూర్య కలయిక ప్రభావం ఉండబోతుందో చూద్దాం.

కుంభ రాశి

కుంభ రాశిలో సూర్యుడు రాహువు కలయిక ప్రతికూల పరిస్థితులు కలిగిస్తుంది అనవసర ఖర్చులు ఉంటాయి. కావున ఆర్థికంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. మీనా రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక సమయంలో వచ్చే అశుభకరమైన గ్రహణ యోగం వల్ల మీ మీద నిరాధారమైన ఆరోపణలు కలిగే అవకాశం ఉంది. తప్పు చేయకుండానే నిందలు పడాల్సి వస్తుంది. సమస్యలను నివారించేందుకు మీరు పడిన జాగ్రత్తగా తీసుకోవాలి.

సింహ రాశి

మార్చి 14 నుంచి సింహ రాశి జాతకులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రత్యేకించి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీన రాశిలో సూర్యుడు రాహు కలయికల ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపార ఒప్పందాలు చేయకపోవడమే మంచిది. పెట్టుబడులు పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది.

తులా రాశి

తులా రాశిలో జన్మించిన వారికి ఈ రెండు గ్రహాల సంయోగం అనుకూల ఫలితాలు ఇవ్వదు. సూర్యుడు రాహువు సంయోగం తులా రాశి ఆరో ఇంట్లో జరుగుతుంది. ఫలితంగా ప్రత్యర్థుల నుంచి అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టపరమైన విషయాలు ఆందోళన కలిగిస్తాయి. మీపై శత్రువులు విజయం సాధిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి.

సూర్యుడు, రాహువు గ్రహాల కలయిక వల్ల మరికొన్ని గ్రహాల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల వృశ్చికం, మిథున, మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. ఈ రాశి జాతకులు కెరీర్, వృత్తి పరంగా అభివృద్ధి ఉంటుంది. వీరి కోరికలు నెరవేరుతాయి. శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది.

వ్యాపారంలో పెద్ద ప్రాజెక్టులు పొందుతారు. ఆదాయ వనరులకు ఎటువంటి లోటు ఉండదు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పని తల పెడితే అందులో విజయం సాధిస్తారు. ఈ సమయంలో జీవితంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా బలపడతారు. స్నేహితులుతో కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

 

 

Whats_app_banner