Planet conjunction: వృషభ రాశిలో మూడు గ్రహాల కలయిక.. వీళ్ళు రాజులాంటి జీవితం గడుపుతారు-sun venus jupiter conjunction in vrishabha rashi these zodiac signs get king life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planet Conjunction: వృషభ రాశిలో మూడు గ్రహాల కలయిక.. వీళ్ళు రాజులాంటి జీవితం గడుపుతారు

Planet conjunction: వృషభ రాశిలో మూడు గ్రహాల కలయిక.. వీళ్ళు రాజులాంటి జీవితం గడుపుతారు

Gunti Soundarya HT Telugu

Planet conjunction: ప్రస్తుతం వృషభ రాశిలో మూడు గ్రహాల కలయిక జరిగింది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వాళ్ళు రాజులాంటి జీవితం లభిస్తుంది. ఏయే రాశులకు ఆ అదృష్టం ఉందో చూసేయండి.

వృషభ రాశిలో మూడు గ్రహాల కలయిక

Planet conjunction: ప్రస్తుతం వృషభ రాశిలో గ్రహాల జాతర జరుగుతోంది. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కలయిక చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో సూర్యుడు, బృహస్పతి, శుక్రుడు ఒకే రాశిలో అంటే వృషభ రాశిలో ఉన్నారు.

జ్యోతిషశాస్త్రంలో ఈ మూడు గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజు అంటారు. శారీరక ఆనందం, వైవాహిక జీవితం, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి వాటికి కారకుడు. శుక్రుడు వృషభం, తుల రాశి వారికి అధిపతి మీన రాశి ఉన్నత రాశి, కన్యా రాశి బలహీనరాశి.

అదే సమయంలో గురువు జ్ఞానం, పిల్లలు, విద్య, ధార్మిక పని, పవిత్ర స్థలాల సందర్శన, సంపద, దానం, సద్గుణం, ఎదుగుదల మొదలైన వాటికి కారకంగా చెప్తారు. వృషభ రాశిలో ఇటువంటి శుభకరమైన మూడు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. రాజులాంటి జీవితాన్ని గడుపుతారు. మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల కలయిక జూన్ 14 వరకు ఉంటుంది. మరికొద్ది రోజుల్లో వీటికి జతగా బుధుడు కూడా వచ్చి చేరతాడు. మే 31 బుధుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం ఏయే రాశుల మీద ఉంటుందో చూద్దాం.

మేష రాశి

మేష రాశి జాతకులు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పూర్తి దృష్టి పెట్టి పనిని పూర్తి చేస్తారు. ఫలితంగా ప్రశంసలు అందుకుంటారు. పని ప్రాంతం నుంచి శుభవార్తలో అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. నెలాఖరులో మీకు శుభవార్త అందుతుంది. అదృష్టం లభిస్తుంది. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది .కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. అనేక పనుల్లో విజయం సాధిస్తారు.

మిథున రాశి

మూడు గ్రహాల శుభ ప్రభావంతో మిథున రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబం నుంచి ఆకస్మిక శుభవార్తలు అందుకుంటారు. ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇది ఆర్థిక పక్షాన్ని బలోపేతం చేస్తుంది. కుటుంబం ఆనందంగా సౌకర్యవంతంగా జీవిస్తారు. అదృష్టం వెన్నంటే ఉంటుంది.

సింహ రాశి

మీరు ఉద్యోగాలు మారడం గురించి ఆలోచిస్తున్నట్లయితే అందుకు ఈ సమయం అనువుగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అన్నింటా విజయం మిమ్మల్ని వరుస్తుంది. ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధికి ఆస్కారం ఉంది. జీవిత భాగస్వామితో రొమాంటిక్ గా గడుపుతారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.

కన్యా రాశి

సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. గృహంలో ఆనందం వెల్లి విరుస్తుంది. వ్యాపార ఉద్యోగ పరంగా ఈ మాసం చాలా ముఖ్యమైనది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో విజయం సాధించేందుకు కష్టపడాల్సిన అవసరం ఉండదు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. జీవిత భాగస్వామికి అండగా నిలుస్తారు.