Bhadra maha purusha rajayogam: జూన్ నెలలో అద్భుతమైన రాజయోగం ఇవ్వబోతున్న బుధుడు.. వీరికి అన్నీ లాభాలే-mercury transit in mithuna rasi will form bhadra maha purusha rajayogam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bhadra Maha Purusha Rajayogam: జూన్ నెలలో అద్భుతమైన రాజయోగం ఇవ్వబోతున్న బుధుడు.. వీరికి అన్నీ లాభాలే

Bhadra maha purusha rajayogam: జూన్ నెలలో అద్భుతమైన రాజయోగం ఇవ్వబోతున్న బుధుడు.. వీరికి అన్నీ లాభాలే

Gunti Soundarya HT Telugu
May 23, 2024 03:27 PM IST

Bhadra maha purusha rajayogam: జూన్ నెలలో బుధుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఫలితంగా భద్ర మహా పురుష రాజయోగం ఏర్పడబోతుంది. దీని వల్ల మూడు రాశుల వారికి జీవితమే మారిపోతుంది. కోరికలన్నీ నెరవేరతాయి.

అద్భుతమైన రాజయోగం ఇవ్వబోతున్న బుధుడు
అద్భుతమైన రాజయోగం ఇవ్వబోతున్న బుధుడు

Bhadra maha purusha rajayogam: జూన్ నెలలో అద్భుతమైన రాజయోగం ఏర్పడబోతుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు మే 31వ తేదీ వృషభ రాశిలోకి వెళతాడు. జూన్ నెలల్లో మిథున రాశి సంచారం చేస్తాడు. 

అతి త్వరగా రాశి చక్రాన్ని బుధుడు మార్చుకోగలడు. మేధస్సు, వ్యాపారం, కమ్యూనికేషన్, సాంకేతికత మొదలైన వాటికి బుధుడు బాధ్యత వహించే గ్రహం. బుధుడు జూన్ 14 నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం అన్ని రాశి చక్రగుర్తులను ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో జాతకులు శుభ ఫలితాలను పొందుతారు.

భద్ర మహాపురుష రాజయోగం అంటే ఏంటి?

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు సొంత రాశి లేదా ఉన్నతమైన రాశి లేదా మూల త్రికోణంలో ఉన్నప్పుడు భద్ర అనే పంచ మహా పురుష యోగం ఏర్పడుతుంది. అటువంటి యోగంలో జన్మించిన వ్యక్తులు చాలా ధైర్యవంతులుగా పరిగణిస్తారు. శత్రువులను నాశనం చేయగల గొప్ప సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. ఈ యోగం వల్ల అనుగ్రహం పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.

మిథున రాశి

మిథున రాశి వారికి భద్ర మహాపురుష రాజ యోగం ఫలవంతమైన కాలం. ఈ కాలంలో కెరీర్ లో సానుకూల ఫలితాలు పొందుతారు. అంచనాలకు తగినట్లుగా కొత్త ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. ఇది వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కోరికలన్నీ ఈ కాలంలో నెరవేరుతాయి. ఉత్తమ ఫలితాలు పొందుతారు .ఉద్యోగంలో ప్రమోషన్ సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తమ సామర్థ్యాల మేరకు అపారమైన విజయాలను ఆశించవచ్చు. వ్యాపారులకు డబ్బు సంపాదించేందుకు ఇదే ఉత్తమ సమయం. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మంచి పోటీదారులుగా నిలుస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులకు ఇది అదృష్ట కాలం. డబ్బు ఆదా చేస్తారు. విదేశాలకు వెళ్లి డబ్బులు  సంపాదించాలనే కోరిక కలిగిన వ్యక్తుల కల నెరవేరుతుంది. భద్ర మహాపురుష రాజయోగం వల్ల మంచి ఆదాయం సాధిస్తారు. 

సింహ రాశి

సింహ రాశి జాతకులకు ఈ కాలంలో విజయం, పురోగతి సాధించడంపైనే దృష్టి అంతా ఉంటుంది. బుధుడి సంచారం వలన ఏర్పడిన ఈ శుభయోగం ఆధ్యాత్మికత వైపు ముగ్గు చూపేలా చేస్తుంది. పనికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పెద్ద విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు, ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఒప్పందాలు చేసుకుంటారు. ఈ కాలంలో వాళ్ళు మంచి లాభాలను గడిస్తారు. డబ్బు సంపాదించేందుకు ఇది సువర్ణావకాశం. కార్యాలయంలో అంకితభావంతో పనిచేస్తారు. ఈ కాలంలో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు. 

మకర రాశి

భద్ర మహాపురుష రాజయోగం కారణంగా మకర రాశి వారికి అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది . కెరీర్ లో అత్యుత్తమ ప్రయోజనాలు పొందుతారు కార్యాలయంలో వీరి ప్రయత్నాలకు ప్రమోషన్లు లభిస్తాయి. జీతం స్థాయిలు పెరుగుతాయి. పొదుపు  చేస్తారు. వివిధ కారణాల వల్ల విదేశాలకు వెళతారు. వ్యాపారస్తులు ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారులకు అనుకూలమైన సమయం. ప్రత్యర్థులకు మంచి పోటీ ఇచ్చి తమ విలువను నిరూపించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలుస్తారు. 

 

WhatsApp channel