తెలుగు న్యూస్ / ఫోటో /
బుద్ధ పూర్ణిమ రోజున చాలా శుభయోగాలు: ఈ మూడు రాశుల వారికి అదృష్టం
Buddha purnima 2024: బుద్ధ పూర్ణిమ మే 23వ తేదీన వచ్చింది. ఈ రోజున అనేక శుభయోగాలు రానున్నాయి. దీంతో ఆ రోజున కొన్ని రాశుల వారిని అదృష్టం వరించనుంది. చాలా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి.
(1 / 5)
హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని పూర్ణిమ రోజున బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. దీంతో మే 23వ తేదీన బుద్ధ పూర్ణిమ వచ్చింది. ఈ రోజున చాలా శుభయోగాలు వస్తున్నాయి. ఈ సమయంలో సర్వార్థ సిద్ధ యోగం, శివయోగం సహా మరిన్ని యోగాలు ఉండనున్నాయి.
(2 / 5)
మే 23న బుద్ధ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా మేలు. ఆ రోజున గజలక్ష్మి రాజయోగం, శివయోగం, సర్వార్థ సిద్ధి యోగం ఉంటాయి. అలాగే, గురుఆదిత్య, శుక్రాదిత్య లాంటి యోగాలు కూడా ప్రభావం చూపుతాయి. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. మంచి ఫలితాలను సాధిస్తారు. ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకోండి.
(3 / 5)
వృషభ రాశి: ఈ సమయంలో వృషభ రాశి వారికి లక్ష్మిదేవీ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. సంపదతో పాటు చాలా కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కుటుంబంతో బంధం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనులకు ప్రశంసలు రావటంతో పాటు పెద్ద బాధ్యతలు కూడా రావొచ్చు. వేతనం పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. నూతన ఆదార మార్గాలు లభిస్తాయి. భవిష్యత్తు కోసం పొదుపును కూడా పెంచుకునే అవకాశం ఉంది.
(4 / 5)
సింహరాశి: రాజ యోగాల ఫలితం సింహరాశి వారికి కూడా దక్కుతుంది. ఈ సమయంలో వీరి ధనం, సంపద పెరుగుతుంది. పొదుపు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరు ఆస్తులు, వాహనాలు, భూములు కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న కొన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. శుభ యోగాల ప్రభావంతో వీరు భవిష్యత్తులోనూ లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితోనూ బంధం మెరుగ్గా ఉంటుంది.
(5 / 5)
తులారాశి: ఈ కాలంలో తులారాశి వారికి కూడా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కార్యసిద్ధి దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రశంసలు దక్కుతాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి. పెద్ద మొత్తంలో డబ్బు దక్కొచ్చు. కార్యాలయాల్లో పెద్ద బాధ్యతలు దక్కొచ్చు. (గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. ఈ సమాచారం నమ్మకాలు, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.)
ఇతర గ్యాలరీలు