Mercury transit: మే నెలలో మరోసారి రాశిని మార్చుకోబోతున్న బుధుడు.. వీరికి ఊహించనంత డబ్బు
Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మే నెలలో మరోసారి రాశిని మార్చుకోబోతున్నాడు. ఫలితంగా మూడు రాశుల వారికి ఊహించనంత డబ్బు చేతికి అందబోతుంది.
Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మే నెలలో రెండుసార్లు తన రాశిని మార్చుకుంటాడు. దీని కారణంగా కొందరికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. తెలివితేటలు, మేధో సామర్థ్యం వంటి వాటికి బుధుడిని కారకుడిగా భావిస్తారు. మే 10న బుధుడు మేష రాశిలోకి ప్రవేశించాడు. మరికొద్ది రోజుల్లో తన రాశిని మార్చుకుంటాడు.

మే 31వ తేదీ బుధుడు మరోసారి తన రాశిని మార్చుకుని వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా మే నెలలో రెండుసార్లు వేర్వేరు రాశి చక్రాలలో బుధుడు ప్రయాణిస్తాడు. దీని ఫలితంగా వృత్తి, వ్యాపారాలలో చాలా పురోగతి పొందుతారు. చంద్రుడి తర్వాత అత్యంత వేగంగా రాశిని మార్చుకోగల గ్రహంగా బుధుడిని పరిగణిస్తారు. బుధుడి శుభ ప్రభావం ప్రజల జీవితంలో సౌలభ్యం, విభిన్న సౌకర్యాలను కలిగిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఉన్నత స్థాయి జ్ఞానాన్ని కూడా పొందుతారు.
జీవితంలోని వివిధ అంశాలలో విజయం సాధిస్తారు. బుధుడి అనుగ్రహంతో వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్, వ్యాపారాలలో పనిచేస్తున్న వారికి బుధ గ్రహ ప్రభావం అద్భుతంగా ఉంటుంది. బుధుడు రాహువు, కేతువు, అంగారకుడితో కలిసి ఉంటే అనేక ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే కుజుడుతో కలిస్తే మేధో స్థాయిలు తగ్గుతాయి. దూకుడు స్వభావంతో ఉంటారు. బుధుడి రాశి మార్పు ఎవరికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి
బుధుడు మేష రాశిని వీడి త్వరలో వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అందువల్ల మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బుధుడు డబ్బు గృహంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివిధ రంగాల నుంచి ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. అపారమైన వ్యాపార విజయాన్ని పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. కొత్త వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. లాభాలను ఆర్జించే అనువైన అవకాశాలు ఉన్నాయి. మీ మాటల మాధుర్యంతో ఇతరులు ప్రభావితం అవుతారు.
కర్కాటక రాశి
బుధుడి సంచారం కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కర్మ, ఆదాయ గృహాలలో బుధుడి ప్రయాణం సాగుతుంది. ఫలితంగా వ్యాపారాలలో భారీ ప్రయోజనాలు పొందుతారు. లాభాలు, మంచి మొత్తంలో డబ్బు సంపాదించేందుకు గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. పని రంగంలో అదృష్టం మద్దతు ఉంటుంది. సంతోషంగా సంతృప్తికరంగా జీవిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాల వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు విదేశీ ఒప్పందాల నుండి భారీ లాభాలు పొందుతారు.
సింహ రాశి
సింహ రాశి వారికి బుధుడి సంచారం ఆర్థికంగా మేలు చేస్తుంది. ఈ సంచారం కర్మ, తొమ్మిదో ఇంట్లో జరుగుతుంది. ఫలితంగా డబ్బు సంపాదించడంలో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తులు తమ రంగాల్లో విజయవంతం అవుతారు. జీవితంలో గొప్ప విజయాలను పొందుతారు. ఆత్మవిశ్వాసంతో అనేక లాభాలు గడిస్తారు.