Sun transit: ఏడాది తర్వాత మిథున రాశిలోకి సూర్యుడు.. ఏ రాశుల వారికి అదృష్టం లభిస్తుందంటే-sun transit into mithuna rashi after one year these zodiac signs progressive benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: ఏడాది తర్వాత మిథున రాశిలోకి సూర్యుడు.. ఏ రాశుల వారికి అదృష్టం లభిస్తుందంటే

Sun transit: ఏడాది తర్వాత మిథున రాశిలోకి సూర్యుడు.. ఏ రాశుల వారికి అదృష్టం లభిస్తుందంటే

Gunti Soundarya HT Telugu
May 27, 2024 09:00 AM IST

Sun transit: సూర్యుడు జూన్ నెలలో తన రాశిని మార్చుకోబోతున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. అవి ఏ రాశులు, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మిథున రాశిలోకి సూర్యుడు
మిథున రాశిలోకి సూర్యుడు

Sun transit: నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం సూర్యుడు. అందుకే గ్రహాల రాజుగా పరిగణిస్తారు. ప్రతినెల సూర్యుడి సంచారం జరుగుతుంది. మొత్తం 12 రాశులను చుట్టి వచ్చేందుకు సూర్యుడికి ఏడాది సమయం పడుతుంది.

ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న సూర్యుడు త్వరలోనే తన రాశిని మార్చుకోబోతున్నాడు. బుధుడికి చెందిన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏడాది తర్వాత సూర్యుడు మిథున రాశిలో సంచరించబోతున్నాడు. సూర్యుడు పవిత్ర స్థానంలో ఉంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెంచుతుంది. జూన్ 15న సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

మిథున రాశిలో సూర్యుడి సంచారం ఒక వ్యక్తి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఇతరులతో సత్సంబంధాలను ఏర్పరచుకునేందుకు ఇది మంచి సమయం అవుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. కమ్యూనికేషన్ కి కారకుడిగా బుధుడిని భావిస్తారు. అటువంటి బుధుడికి చెందిన రాశిలో సూర్యుడి సంచారం వల్ల కొత్త విషయాలను, నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇది ఉత్తమ సమయం. మీ ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దైవికంతో కనెక్ట్ అయ్యేందుకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా బలపడతారు.

మిథున రాశి

గ్రహాల రాజు సూర్యుడు మిథున రాశిలోనే ప్రవేశం చేస్తాడు. ఫలితంగా ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలు పొందుతారు. మీరు చేసుకునే ఒప్పందాలు భారీ ఆర్థిక లాభాలను ఇస్తాయి. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా సమసిపోతాయి. సూర్యుడి శుభ ప్రభావంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది .కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఇది శ్రేయస్సు, విజయానికి దారి తీస్తుంది.

సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్య భగవానుడు. అటువంటి సింహ రాశి వారికి సూర్యుడి సంచారం అత్యంత అనుకూలమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఆగిపోయిన మీ పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. కెరీర్ లో ప్రమోషన్ పొందడానికి మీరు అనేక ముఖ్యమైన పనులు అప్పగిస్తారు. వాటిని బాగా చేయాల్సి ఉంటుంది. సౌభాగ్యం వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఈ రాశి వాళ్ళు సౌకర్యానికి సరిపోయేలా అవసరమైన అన్ని వస్తువులను పొందవచ్చు. కుటుంబం ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటుంది. కొత్త ఉద్యోగం లభిస్తుంది.

కన్యా రాశి

ఏడాది తర్వాత మిథున రాశిలోకి ప్రవేశించబోయే సూర్యుడు కన్యా రాశి వారికి ఎంతో మేలు చేయబోతున్నాడు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కానీ బడ్జెట్ ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు నియంత్రించుకోవాలి. దుబారా ఖర్చులు వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి. ఈ సమయంలో కొత్త పనుల ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా మధురంగా ఉంటుంది. జీవితంలో పురోగతిని అనుభవిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలమైన ఆర్థిక సంపాదన కోసం సరైన ఒప్పందాలు చేసుకోవడం కోసం ఈ సమయం ఉత్తమమైనది.

WhatsApp channel