Mangala dosham: మంగళ దోషం తొలగించే ఈ రత్నాన్ని ధరించండి.. మీ వైవాహిక జీవితం ప్రేమతో నిండిపోతుంది
Mangala dosham: మంగళ దోషం ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. ఈ దోషాన్ని తొలగించుకునేందుకు పగడపు రత్నం ధరించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఇది ధరించడం వల్ల వైవాహిక జీవితం ప్రేమతో నిండిపోతుంది.
Mangala dosham: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో మంగళ దోషం ఉంటే వాళ్ళు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాహం ఆలస్యం అవుతుంది. పెళ్లి చేసుకున్న వారి జీవితం సంతోషకరంగా ఉండదు. దీన్నే కుజదోషం అని కూడా అంటారు.
వివాహ జాతకంలో లేదా ప్రత్యేక గృహాలలో అంగారక గ్రహం ఉండడం వల్ల మంగళ దోషంగా పరిగణిస్తారు. కుజ దోషం ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. వ్యక్తి జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. దాంపత్య సంతోషాన్ని కోల్పోతారు. అన్ని దోషాలలో కెల్లా అత్యంత ప్రభావంతమైనది ఇది. ఈ దోషాన్ని తొలగించుకునేందుకు జాతకంలో కుజుడి స్థానాన్ని బలపరుచుకునేందుకు కొన్ని ప్రత్యేక రత్నాలు ధరించవచ్చు.
రత్న శాస్త్రం ప్రకారం ఇవి చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. అలాంటి రత్నాలలో అంగారకుడికి సంబంధించినది ఒకటి పగడపు రత్నం. ఈ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటాడు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీని ధరించే ముందు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.
పగడం ధరించేందుకు నియమాలు
మంచి ఫలితాలు పొందేందుకు పగడపు రత్నం ధరించడానికి ముందు తప్పనిసరిగా జ్యోతిష్యుడి సలహా తీసుకోవాలి. మంగళ దోషం ఉన్నవాళ్లు బంగారం లేదా రాగి ఉంగరాలతో కూడిన పగడాలను ధరించవచ్చు. మంగళవారం నాడు ఈ రత్నాన్ని ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. సోమవారం రాత్రి పచ్చి పాలు లేదా గంగాజలం మిశ్రమంలో ఈ ఉంగరాన్ని వేయాలి. తర్వాత మంగళవారం రోజు హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించాలి. తర్వాత ఉంగరాన్ని అందులో నుంచి తీసి శుద్ధి చేసి ధరించాలి. చూపుడు వేలు లేదా ఉంగరం వేలికి ఈ పగడం ధరించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
పగడం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
పగడం రత్నాన్ని ధరించడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. మంగళ దోషం ప్రభావం తగ్గుముఖం పడుతుంది. అంగారకుడి స్థానం బలపడుతుంది. వీటిని ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తిలో అడ్డంకులను తొలగించడంలో ఈ రత్నం ప్రయోజనకరంగా పనిచేస్తుంది. పగడాన్ని ధరించడం వల్ల ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాలు, నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోపాన్ని నియంత్రించడంలో ఈ రత్నం ప్రభావంతంగా పని చేస్తుంది. పగడాన్ని ధరిస్తే మనసులో నెగటివిటీ తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.
భయం, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సోమరితనం నుంచి బయట పడేందుకు ఉపయోగపడుతుంది. అలాగే రక్తసంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఈ ఉంగరాన్ని ధరించవచ్చు. పురుషులు కుడి చేతి ఉంగరం వేలికి ధరిస్తే, స్త్రీలు ఎడమచేతి ఉంగరం వేలికి ధరించడం మంచిది. పగడాన్ని ధరించడం వల్ల కుజుడి శక్తి బలపడుతుంది. మంగళ దోష ప్రభావం తగ్గించేందుకు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం మంచిది.
హనుమంతుడిని పూజిస్తూ మంగళవారం నాడు సుందర కాండ పారాయణం చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అంగారకుడి ప్రభావం తగ్గేందుకు పేదవారికి ఎర్ర పప్పు వంటి వాటిని దానం చేయడం మంచిది.
టాపిక్